Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది' కలెక్షన్ల సునామీ.. చిత్రబృందం ఘనంగా నిర్వహించిన థాంక్యూ మీట్

'పెద్ది' కలెక్షన్ల సునామీ.. చిత్రబృందం ఘనంగా నిర్వహించిన థాంక్యూ మీట్

వార్త 6 days ago

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. గ్రామీణ క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం, థియేటర్లలోకి వచ్చిన కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.

292 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ ల్యాండ్‌మార్క్ సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకుంటూ చిత్ర యూనిట్ సోమవారం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ‘థాంక్యూ మీట్’ నిర్వహించింది. ఈ సక్సెస్ మీట్‌లో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో పాటు చిత్ర నిర్మాతలు, ఇతర సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.

Read also: Slum Dog Movie Teaser : పూరి 'స్లమ్ డాగ్' టీజర్ రిలీజ్

జగపతి బాబు నటనకు కళ్లల్లో నీళ్లొచ్చాయి: రామ్ చరణ్

సక్సెస్ మీట్ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ, ఈ భారీ విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, మీడియాకు మరియు చిత్ర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి పనిచేశారని.. ముఖ్యంగా 185 రోజుల షూటింగ్ వ్యవధిలో నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా సెట్‌లోనే ఉండి సపోర్ట్ అందించారని కొనియాడారు. “తెరపై జగపతి బాబు గారి పవర్‌ఫుల్ నటన చూసి నేను భావోద్వేగానికి లోనయ్యాను, నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి.” అని చరణ్ ఎమోషనల్ అయ్యారు. నిజాయతీతో కూడిన ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసిందని ఆనందం వ్యక్తం చేశారు.

Peddi: బుచ్చిబాబు ప్రతిభను చూసి అప్పుడే హగ్ చేసుకున్నా!

దర్శకుడు బుచ్చిబాబు సానా గురించి రామ్ చరణ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బుచ్చిబాబు ఈ కథను వినిపించిన వెంటనే ఆయన విజన్‌కు, ప్రతిభకు ఫిదా అయిపోయి.. ఆయన్ని గట్టిగా కౌగిలించుకుని ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని చరణ్ గుర్తుచేసుకున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ అందించిన మ్యూజిక్, గేయ రచయిత అనంత శ్రీరామ్ సాహిత్యం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని చెప్పారు. కాగా, ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, కన్నడ స్టార్ శివరాజ్‌ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో మెప్పించారు.

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఆ అంచనాలను అందుకున్న ‘పెద్ది’

1980వ దశకంలో సాగే ఈ పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా కోసం చిత్ర యూనిట్ దాదాపు రెండున్నరేళ్ల పాటు కష్టపడింది. ‘ఆర్ఆర్ఆర్’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. దీంతో చరణ్ నుంచి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో ‘పెద్ది’పై ఇండస్ట్రీలోనూ, అభిమానుల్లోనూ ఆకాశమంత అంచనాలు ఏర్పడ్డాయి. జూన్ 4న విడుదలైన ఈ చిత్రం, ఆ అంచనాలన్నింటినీ పటాపంచలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha