Peddi Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవేటెడ్ చిత్రం 'పెద్ది' భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమాకు థియేటర్ల వద్ద మెగా సందడి మొదలైంది.
'పెద్దిగాడి ఆట'కు మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు. చెర్రీ ఈ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారంటూ థియేటర్ల వద్ద ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ మాస్ సంబరాల్లో మెగా కోడలు ఉపాసన కొణిదెల కూడా భాగస్వామి కావడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Upasana creates a stir by throwing papers at Ram Charan's entry scene in 'Peddhi'
Peddi Movie: మైత్రీ విమల్ థియేటర్లో ఉపాసన హంగామా
బుధవారం రాత్రి 'పెద్ది' చిత్రానికి సంబంధించిన ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్రదర్శించారు. హైదరాబాద్ బాలానగర్‌లోని మైత్రీ విమల్ థియేటర్లో ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్‌కు ఉపాసన తన ఫ్యామిలీ మెంబెర్స్‌తో కలిసి వచ్చారు. సాధారణంగా సినిమాలకు, మాస్ సెలబ్రేషన్స్‌కు కాస్త దూరంగా ఉండే ఉపాసన.. ఈసారి మాత్రం పక్కా మాస్ ఆడియన్ లా మారిపోయారు. థియేటర్లో అభిమానుల మధ్య కూర్చొని సినిమా చూస్తూ వారిలో మరింత ఉత్సాహం నింపారు.
స్క్రీన్ పై చెర్రీ ఎంట్రీ.. పేపర్లు ఎగరేసిన మెగా వైఫ్
వెండితెరపై రామ్ చరణ్ మాస్ ఎంట్రీ ఇవ్వగానే థియేటర్ మొత్తం అభిమానుల అరుపులతో మారుమోగిపోయింది. ఆ సమయంలో ఉపాసన కూడా ఫ్యాన్స్‌తో కలిసి పెద్దగా అరుస్తూ, గాల్లోకి పేపర్లు ఎగరేస్తూ రచ్చ రచ్చ చేశారు. భర్త స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ఆమె మురిసిపోతూ, కేరింతలు కొట్టిన విజువల్స్ మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఉపాసన తన కుటుంబంతో కలిసి 'పెద్ది' సినిమాను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలపై "మెగా కోడలు కూడా పక్కా మాస్ అంతే" అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read also:
పెద్ది తో రామ్ చరణ్ రెండేళ్ల కష్టం ఫలించిందా?

