Peddi Hellallallo Song Promo: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' (Peddi) చిత్రం నుండి మేకర్స్ మరో అదిరిపోయే మాస్ అప్‌డేట్‌ను విడుదల చేశారు.

Peddi Hellallallo Song Promo: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ 'పెద్ది' (Peddi) చిత్రం నుండి మేకర్స్ మరో అదిరిపోయే మాస్ అప్‌డేట్‌ను విడుదల చేశారు.
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సన (Buchibabu Sana) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ విలేజ్ యాక్షన్ డ్రామా చిత్రం జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ సొంతం కాగా, ఇప్పుడు ఈ ఐటెం సాంగ్ ప్రోమోతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
Peddi Hellallallo Song Promo: శృతి హాసన్ ‘మాస్’ స్టెప్పులు.. చరణ్ ఫ్యాన్స్‌కు పూనకాలే!
Shruti Haasan Item Song Peddi
ఈ ప్రత్యేక గీతం కోసం శృతి హాసన్‌ను ఎంపిక చేసినప్పటి నుంచే టాలీవుడ్‌లో భారీ క్రేజ్ ఏర్పడింది. తాజాగా విడుదలైన ప్రోమోలో దేవి శ్రీ ప్రసాద్ (DSP) అందించిన హై-ఎనర్జీ మాస్ బీట్స్, దానికి తగ్గట్టుగా శృతి హాసన్ వేసిన అదిరిపోయే మూమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్లలో ఈ సాంగ్ వచ్చేటప్పుడు చరణ్ ఫ్యాన్స్‌కు ఖచ్చితంగా పూనకాలు రావడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
రామ్ చరణ్ కెరీర్‌లో ‘రంగస్థలం’ తర్వాత వస్తున్న పక్కా లోకల్ రా అండ్ రస్టిక్ విలేజ్ డ్రామా కావడంతో, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి సాంగ్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
ప్యాట్ కమిన్స్ బౌలింగ్.. పెద్ది భామ బ్యాటింగ్