Peddi movie : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ ప్రక్రియ పూర్తయింది.
సెన్సార్ బోర్డు ఈ నివేదిక U/A 16+ సర్టిఫికెట్ జారీ చేసింది.
భారీ రన్‌టైమ్ చర్చనీయాంశం
ఈ సినిమా రన్‌టైమ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చకు దారితీసింది. 'పెద్ది' మొత్తం 3 గంటల 9 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. సాధారణంగా ఇటీవలి కాలంలో సినిమాల నిడివి తగ్గిస్తున్న తరుణంలో, ఇంత భారీ రన్‌టైమ్‌ను ఖరారు చేయడం ప్రత్యేకంగా మారింది. కథపై పూర్తి నమ్మకంతోనే దర్శకుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ట్రైలర్‌కు మంచి స్పందన
ఇటీవల ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ కొత్త లుక్‌లో కనిపించనున్నారు.
Read Also : Ramani Kalyanam Movie: ఎమోషనల్ లవ్ స్టోరీ 'రమణి కళ్యాణం' మూవీ రివ్యూ
Peddi movieభారీ తారాగణం
ఈ చిత్రంలో జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' పాత్రలో నటిస్తోంది. అలాగే శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా వృద్ధి సినిమాలు, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు ఉన్నాయి. ముందుగా ప్రకటించినట్లుగానే జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

