Peddi: మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌పై ఉన్న అభిమానం సరిహద్దులు దాటింది. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'పెద్ది' (Peddi) మొదటి రోజు మొదటి షో చూసేందుకు ఇద్దరు జపాన్ యువతులు టోక్యో నగరం నుండి నేరుగా భాగ్యనగరానికి చేరుకున్నారు.
ఈ అరుదైన సంఘటన అంతర్జాతీయంగా రామ్ చరణ్‌కు ఉన్న తిరుగులేని ప్రజాదరణకు, క్రేజ్‌కు మరోసారి నిదర్శనంగా నిలిచింది. మసామి, క్రిస్ అనే ఈ ఇద్దరు వీరాభిమానులు కేవలం ఈ సినిమా కోసమే తమ ఉద్యోగాలకు ఐదు రోజుల పాటు సెలవు పెట్టడం విశేషం. సినిమా రిలీజ్ కావడానికి రెండు రోజుల ముందే వారు హైదరాబాద్‌లో ల్యాండ్ అయ్యారు.
RamCharanJapanFans
read also:Chiranjeevi tweet: పెద్ది సినిమా ఫై చిరంజీవి ఆసక్తికర ట్వీట్
5 రోజుల సెలవు.. 10 షోలు చూడడమే టార్గెట్!
హైరాబాద్ చేరుకున్న ఈ జపాన్ అభిమానులు.. తమ స్థానిక స్నేహితురాలు కన్మణి సహాయంతో నగరంలోని ప్రముఖ మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సందడి చేస్తున్నారు. థియేటర్ల వద్ద మన తెలుగు ప్రేక్షకులతో కలిసి సినిమా చూస్తూ, ఇక్కడి పండగ వాతావరణాన్ని, హంగామాను వారు ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తున్నారు. తమ ఈ ఐదు రోజుల హైదరాబాద్ పర్యటన ముగిసేలోపు వివిధ థియేటర్లలో కనీసం 10 షోల వరకు 'పెద్ది' సినిమాను చూడాలని వారు ముందే ప్లాన్ చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Peddi: జపాన్‌లో రిలీజ్ క్యాన్సిల్.. అందుకే నేరుగా ఇండియాకు!
దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటించగా.. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. 'ఆర్ఆర్ఆర్' (RRR) సినిమా ఘనవిజయం సాధించినప్పటి నుంచి జపాన్‌లో రామ్ చరణ్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. నిజానికి 'పెద్ది' చిత్రాన్ని జపాన్ దేశంలో కూడా ఒకేసారి విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల చివరి నిమిషంలో జపాన్ రిలీజ్ వాయిదా పడింది. దాంతో ఎంతమాత్రం నిరాశ చెందని ఆ జపాన్ యువతులు.. తమ అభిమాన హీరో సినిమాను తొలిరోజే వెండితెరపై చూడాలనే పట్టుదలతో నేరుగా విమానమెక్కి హైదరాబాద్‌కు వచ్చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also:
'నువ్వేమైనా కలెక్టర్‌వా ప్రధానివా?'.. ప్రకాష్ రాజ్‌కు బండ్ల గణేష్ కౌంటర్!

