Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది' సినిమాకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ షాక్

'పెద్ది' సినిమాకు తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ షాక్

వార్త 1 day ago

Telangana Exhibitors Association Vs Peddi : టాలీవుడ్ లో తాజాగా తెరపైకి వచ్చిన వివాదం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాబోయే ప్రతిష్టాత్మక చిత్రం 'పెద్ది' విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆ చిత్ర బృందానికి గట్టి షాక్ ఇచ్చింది.

తాము అడిగిన పర్సంటేజ్ (వాటా) ఇవ్వకపోతే థియేటర్లలో ‘పెద్ది’ సినిమా షోలను ప్రదర్శించేది లేదని అసోసియేషన్ సభ్యులు తెగేసి చెప్పారు. కేవలం ఈ సినిమా ప్రదర్శన నిలిపివేత హెచ్చరికలతోనే ఆగకుండా, ఎగ్జిబిటర్లు మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఈ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లను ఎట్టిపరిస్థితుల్లోనూ పెంచవద్దంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఓ వినతి పత్రాన్ని కూడా సమర్పించారు. థియేటర్ల మనుగడ సాగించడమే కష్టంగా మారిన తరుణంలో ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని వారు స్పష్టం చేస్తున్నారు.

Read Also : 'పెద్ది' కోసం రామ్ చరణ్ భారీ రిస్క్.. అసలు కారణం ఇదే

ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా చిరంజీవి వైపు చూపు

ఈ వివాదం వెనుక ఉన్న లోతైన కారణాలను ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు మీడియా ముఖంగా వివరించారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ఆదాయ వనరులలో భారీ వ్యత్యాసం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాల ద్వారా థియేటర్ల నిర్వాహకులకు సరైన రెవెన్యూ (ఆదాయం) రావడం లేదని, కానీ నిర్మాతలకు మాత్రం డిజిటల్, శాటిలైట్, ఓటీటీ వంటి దాదాపు 14 రకాల విభిన్న మార్గాల ద్వారా ఆదాయం లభిస్తోందని వారు గుర్తు చేశారు. ఈ తీవ్రమైన నష్టాల నుండి తము గట్టెక్కాలంటే పర్సంటేజ్ పద్ధతిలో మార్పులు రావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు టాలీవుడ్ పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ చిరంజీవిని కలవాలని ఎగ్జిబిటర్లు భావిస్తున్నారు. ఆయనను కలిసేందుకు పర్మిషన్ దొరికితే, తమ ఎదుర్కొంటున్న కష్టాలను, థియేటర్ల గోడును ఆయనకు వివరించి ఈ సంక్షోభానికి ఒక ముగింపు పలకాలని అసోసియేషన్ సభ్యులు ఆశిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha