Peddi Movie Trailer: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
జూన్ 4న సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుండగా, తాజా అప్‌డేట్ ప్రకారం సినిమా ట్రైలర్‌ను మే 17 లేదా 18 తేదీల్లో లాంచ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ట్రైలర్‌తో సినిమా రేంజ్‌ను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని టీమ్ భావిస్తోంది.
ముగింపు దశలో షూటింగ్ సినిమా నిర్మాణానికి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందని సమాచారం. ప్రస్తుతం కేవలం ఒక ఐటెమ్ సాంగ్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉందని, అది కూడా చివరి దశకు చేరుకుందని తెలుస్తోంది. షూటింగ్ పార్ట్ పూర్తి కాగానే పోస్ట్ ప్రొడక్షన్ పనుల వేగాన్ని పెంచి, అనుకున్న సమయానికి ప్రేక్షకు ముందుకు తీసుకురావాలని దర్శకుడు బుచ్చిబాబు పట్టుదలగా ఉన్నారు.
Read Also : Gulf Ban on Jethlee: గల్ఫ్ దేశాల్లో సత్య 'జెట్లీ' సినిమా నిషేధం!
Has the trailer release date been finalized?
Peddi Movie Trailer: పాన్ ఇండియా రేంజ్‌లో ప్రమోషన్లు
ట్రైలర్ విడుదలైన వెంటనే ప్రమోషన్ల విషయంలో గేర్ మార్చాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు. రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రమోషన్లు మునుపెన్నడూ లేని రీతిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ సినిమా హైప్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్తుందని మెగా అభిమానులు ఆశిస్తున్నారు.
గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ విశ్వరూపం
స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ లుక్ మరియు బాడీ లాంగ్వేజ్ కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో ఇప్పటికే పాటలపై భారీ అంచనాలు ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

