Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెద్ది ట్రైలర్‌ విమర్శలపై డైరెక్టర్ బుచ్చిబాబు క్లారిటీ

పెద్ది ట్రైలర్‌ విమర్శలపై డైరెక్టర్ బుచ్చిబాబు క్లారిటీ

వార్త 3 weeks ago

Peddi: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది' జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.

ఈ క్రమంలోనే మూవీ టీమ్ ప్రమోషన్స్ హోరెత్తిస్తోంది. అయితే, ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌పై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవడంతో, దర్శకుడు బుచ్చిబాబు సానా రంగంలోకి దిగి పెదవి విప్పారు. సినిమాలోని అత్యంత కీలకమైన, ఉత్కంఠభరితమైన ఎపిసోడ్స్ ముందే లీక్ కాకూడదనే ఉద్దేశంతోనే ట్రైలర్‌లో కంటెంట్‌ను చాలా లిమిటెడ్‌గా ఉంచామని ఆయన వెల్లడించారు.

 Peddi Movie Trailer

read also: Trisha: విజయ్‌తో రిలేషన్ రూమర్స్.. షాకింగ్ పోస్ట్ పెట్టిన నటి త్రిష

50 నిమిషాల మేజర్ కంటెంట్ దాచేశాం.. థియేటర్లలో మైండ్ బ్లాకే!

ఓ తాజా ఇంటర్వ్యూలో బుచ్చిబాబు మాట్లాడుతూ.. “కథలోని అసలు కోర్ పాయింట్‌ను ఇప్పుడే రివీల్ చేస్తే, వెండితెరపై చూసేటప్పుడు ప్రేక్షకులకు ఆ కిక్ ఉండదు. అందుకే దాదాపు 50 నిమిషాల నిడివి గల అత్యంత ముఖ్యమైన సీన్లను ట్రైలర్ కట్స్‌లో వాడలేదు. ఆ ప్రభావం వల్లే మేము ఏం చెప్పాలనుకున్నామో ట్రైలర్‌లో పూర్తిగా ఎలివేట్ కాలేదు” అని వివరించారు. కొన్నిసార్లు ట్రైలర్ యావరేజ్‌గా అనిపించిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ కొట్టిన దాఖలాలు ఉన్నాయని, తమ సినిమా కూడా అదే మ్యాజిక్‌ను రిపీట్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కథను ముందే ఎక్కువగా చెప్తే థియేటర్‌కు వచ్చే ఆడియన్స్‌కు థ్రిల్ మిస్ అవుతుందని బుచ్చిబాబు స్పష్టం చేశారు.

Peddi: 1980ల నాటి పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా.. కనకదుర్గమ్మ ఆశీస్సులు!

‘ఉప్పెన’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కించిన ఈ చిత్రం 1980ల కాలం నాటి ఆంధ్రప్రదేశ్ పల్లెటూరి నేపథ్యంలో సాగే స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఇందులో రామ్ చరణ్ ఒక పవర్‌ఫుల్ అథ్లెట్‌గా, అలాగే సామాజిక సమస్యలపై పోరాడే లీడర్‌గా విభిన్న రకాల షేడ్స్‌లో కనిపించనున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చారు. కాగా, జూన్ 1న విజయవాడలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముందు చిత్ర యూనిట్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఈ సినిమా ప్రీమియర్ షోల అడ్వాన్స్ బుకింగ్స్ భారీ స్థాయిలో సాగుతున్నాయి.

Read Also hindi news: hindi.vaartha.com

Read also Epaper: epaper.vaartha.com

Read also:

నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో ఊరట.. ఏఐ డీప్‌ఫేక్ కంటెంట్‌పై సంచలన ఆదేశాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha