Peddi Movie Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తదుపరి చిత్రం 'పెద్ది' (Peddi) విడుదల తేదీపై వస్తున్న రూమర్లకు చెక్ పెట్టారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామా వాయిదా పడనుందనే వార్తలపై చరణ్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో మెగా అభిమానులు ఆనడం వ్యక్తం చేస్తున్నారు..ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన, రామ్ చరణ్ కాంబినేషన్‌లో వస్తున్న 'పెద్ది' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
అయితే, ఈ సినిమా విడుదల తేదీ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా నిర్మాత ఎస్కేఎన్ ఒక ఈవెంట్‌లో ‘జూన్ 26’ అని ప్రస్తావించడంతో ఫ్యాన్స్‌లో కంగారు మొదలైంది.
Read Also: Chetak Screen Awards 2025: 'చేతక్ స్క్రీన్ అవార్డ్స్ 2025' నామినేషన్ల పర్వం మొదలు
నిహారిక 'రాకాస' ప్రమోషన్లలో చరణ్ అప్‌డేట్
తన సోదరి నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరిస్తున్న 'రాకాస' చిత్ర ప్రమోషన్లలో భాగంగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'పెద్ది' సినిమా గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.సినిమా అవుట్‌పుట్ చాలా అద్భుతంగా వచ్చిందని, ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారని చరణ్ ధీమా వ్యక్తం చేశారు.'పెద్ది' సినిమా లేట్ అవ్వడం లేదని, ఈ విషయాన్ని అందరికీ తెలిసేలా ప్రమోట్ చేయాలని చిత్ర బృందంతో సరదాగా వ్యాఖ్యానించారు.విద్యార్థులకు పరీక్షలు పూర్తయ్యాక ఈ సినిమా ఒక మంచి వినోదాన్ని అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.
Peddi Movie Updates: విడుదల తేదీ సందిగ్ధం వీడింది!
మొదట మార్చి 27న విడుదల కావాల్సిన ఈ చిత్రం, కొన్ని కారణాల వల్ల ఏప్రిల్ 30కి వాయిదా పడింది. అయితే మళ్ళీ జూన్‌కు వెళ్తుందేమో అన్న భయాలకు చరణ్ తాజా వ్యాఖ్యలతో చెక్ పడింది. ఏప్రిల్ 30నే 'పెద్ది' థియేటర్లలో సందడి చేయడం దాదాపు ఖాయమైంది. వృద్ధి సినిమాస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పెద్ది సినిమాను నిర్మిస్తున్నారు. ఈ విలేజ్ స్పోర్ట్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు త్రిపాఠి, కమెడియన్ సత్య తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:

