Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పెద్ది'లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు?

'పెద్ది'లో శ్రుతి హాసన్ మాస్ స్టెప్పులు?

వార్త 2 months ago

Ram Charan Peddi Movie Shruti Haasan Special Song: బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ డ్రామాలో ఒక క్రేజీ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ శ్రుతి హాసన్‌ను ఫైనల్ చేసినట్లు తాజా సమాచారం.

గతంలో మృణాల్ ఠాకూర్, మానస వారణాసి వంటి పేర్లు వినిపించినప్పటికీ, చివరకు శ్రుతి హాసన్ వైపే మేకర్స్ మొగ్గు చూపారు.

Read Also: Shivani Nagaram: నీలి రంగులో నిగనిగలాడుతున్న శివాని.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్

 Ram Charan Peddi Movie Shruti Haasan Special Song

అప్‌డేట్స్

రామ్ చరణ్ – శ్రుతి హాసన్ జోడీ గతంలో ‘ఎవడు’ సినిమాలో ‘పింపుల్ డింపుల్’ పాటతో థియేటర్లను షేక్ చేశారు. మళ్ళీ వీరిద్దరూ కలిసి మాస్ స్టెప్పులు వేయబోతుండటం మెగా ఫ్యాన్స్‌కు ఐ-ఫీస్ట్ అని చెప్పాలి.ఈ స్పెషల్ సాంగ్ చిత్రీకరణ ఏప్రిల్ 26 నుంచి హైదరాబాద్ శివార్లలోని జనవాడలో వేసిన భారీ సెట్‌లో ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ షూటింగ్‌తో సినిమా మొత్తం చిత్రీకరణ పూర్తవుతుంది.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ పాట కోసం అదిరిపోయే మాస్ బీట్‌ను సిద్ధం చేశారని టాక్.. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’,వంటిపాటలు చార్ట్‌బస్టర్లుగా నిలవడంతో, ఈ స్పెషల్ సాంగ్‌పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.తొలుత ఏప్రిల్ 30న విడుదల చేయాలనుకున్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ పనుల దృష్ట్యా సినిమాను జూన్ 2026కి వాయిదా వేశారు.జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు..చరణ్ ఈ సినిమా కోసం తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకుని ఒక అథ్లెట్‌గా కనిపించబోతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సిటాడెల్ సీజన్ 2.. ట్రైలర్ వచ్చేసింది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha