Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెళ్లి పీటలపై వచ్చిన ఒక్క ఫోన్ కాల్..వరుడు పరార్

పెళ్లి పీటలపై వచ్చిన ఒక్క ఫోన్ కాల్..వరుడు పరార్

వార్త 1 month ago

Bride chases on the roads : హర్యానాలోని కైథల్ ప్రాంతంలో ఒక వివాహ వేడుక జరుగుతుండగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. బంధుమిత్రుల కోలాహలం మధ్య మరికొద్ది నిమిషాల్లో వివాహం ముగుస్తుందనగా వరుడి మొబైల్‌కు ఒక తెలియని నంబర్ నుండి ఫోన్ వచ్చింది.

తాను పెళ్లి చేసుకోబోయే వధువుకు గతంలో మరొకరితో ప్రేమ వ్యవహారం ఉందంటూ అవతలి వ్యక్తి చెప్పడమే కాకుండా, అందుకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలను వాట్సాప్‌లో పంపించాడు. ఆ ఫోటోలను చూడగానే తీవ్ర ఆగ్రహానికి లోనైన వరుడు పెళ్లిని రద్దు చేసుకుని మండపం నుండి బయటకు పరుగులు తీశాడు.

Read Also: EPFO New Portal: పీఎఫ్ ఖాతాదారులకు ఊరట.. అందుబాటులోకి కొత్త ఈపీఎఫ్ఓ పోర్టల్!

 Bride chases on the roads

Bride chases on the roads : రోడ్లపై పెళ్లి దుస్తుల్లో వెంబడించిన వధువు

వరుడు పారిపోతుండటాన్ని గమనించిన వధువు, ఆమె కుటుంబ సభ్యులు వెంటనే అతడిని వెంబడించారు. పెళ్లి కొడుకు దుస్తుల్లో (షేర్వాణీ) ఉన్న వరుడు రోడ్డుపై పరుగులు పెడుతుండగా, భారీ లంగా మరియు నగలతో కూడిన పెళ్లి దుస్తుల్లోనే వధువు కూడా రోడ్డుపై పరిగెత్తుకుంటూ వెళ్ళింది. స్థానిక మార్కెట్, ఆటోలు, వాహనాల మధ్య అతడిని ఆపి మాట్లాడేందుకు వధువు కుటుంబం ఎంతగానో ప్రయత్నించింది. తమ పరువు పోతుందని, కూర్చొని మాట్లాడుకుందామని బతిమాలినా వరుడు మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతున్న దృశ్యాలు స్థానికులను ఆశ్చర్యపరిచాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పెళ్లి దుస్తుల్లో అంత వేగంగా పరుగెత్తడం, కెమెరా యాంగిల్స్ సరిగ్గా ఉండటం చూస్తుంటే.. ఇది నిజమైన ఘటనలా అనిపించడం లేదని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha