5-Year-Old Boy Killed : ఆదివారం సాయంత్రం ఇక్కడ ఒక పెళ్లి ఊరేగింపుకు ముందు జరిగిన సంబరాల్లో కాల్పులు జరపగా, బుల్లెట్ తగిలి ఐదేళ్ల బాలుడు మరణించినట్లు పోలీసులు తెలిపారు.
కడిపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుతెహరి బాంకే గ్రామంలో ఈ ఘటన జరిగింది. పెళ్లి ఊరేగింపు బయలుదేరడానికి ముందు బాలుడి బంధువైన అజయ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. మృతుడిని అర్ష్ పటేల్‌గా గుర్తించారు. బాలుడి తల్లి అమృత పటేల్, కుటుంబ సభ్యులతో కలిసి అతడిని కడిపూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో, వైద్యులు సుల్తాన్‌పూర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించగా, అక్కడికి చేరుకునేసరికే అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. దర్యాప్తు కొనసాగుతోందని, బాలుడి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం పరీక్ష కోసం పంపినట్లు సర్కిల్ ఆఫీసర్ వినయ్ గౌతమ్ తెలిపారు. నిందితుడి కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఆయన తెలిపారు.

