Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెంపుడు నేస్తం 'బఘీరా' మృతి.. ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్

పెంపుడు నేస్తం 'బఘీరా' మృతి.. ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్

వార్త 1 month ago

Jr NTR: టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ప్రేమగా, ప్రాణంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క 'బఘీరా' కన్నుమూసింది.

గత నాలుగేళ్లుగా ఎన్టీఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయిన బఘీరా మృతి చెందడంతో ఎన్టీఆర్ తీవ్ర దుఃఖానికి గురయ్యారు.

Read Also: Ram Charan : రామ్ చరణ్ తో ధురంధర్ బ్యూటీ..?

Jr NTR: సోషల్ మీడియాలో ఎన్టీఆర్ భావోద్వేగ పోస్ట్

తన పెంపుడు నేస్తాన్ని గుర్తుచేసుకుంటూ ఎన్టీఆర్ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక భావోద్వేగపూరిత పోస్ట్‌ను షేర్ చేశారు.

బఘీరా.. నువ్వు నా ప్రపంచంలోకి ఒక తోడుగా అడుగుపెట్టి, ఎంతో నిశ్శబ్దంగా నా కుటుంబంలో ఒకడిగా మారిపోయావు. ఈ నాలుగేళ్ల కాలంలో నీ ప్రేమ, నమ్మకం, అల్లరితో పాటు నువ్వు మాత్రమే ఇవ్వగలిగే ప్రశాంతతతో నా రోజులను నింపేశావు. నువ్వు లేని లోటు నా హృదయాల్లో చాలా పెద్ద శూన్యాన్ని మిగిల్చింది. కానీ నువ్వు మిగిల్చిన ప్రేమ ఎప్పటికీ నాతోనే ఉంటుంది. నన్ను ఎంచుకుని, నాతో పాటు నడిచి ఈ నాలుగేళ్ల ప్రయాణాన్ని ఎంతో అందంగా మార్చినందుకు చాలా థ్యాంక్స్ బఘీరా. నీ ఆత్మకు శాంతి కలగాలి మై లిటిల్ వన్.. నువ్వు ఎప్పుడూ లోతుగా ప్రేమించబడ్డావు, అలాగే ఎప్పటికీ ఉంటావు అని ఎన్టీఆర్ రాసుకొచ్చారు.

బఘీరాతో మధుర జ్ఞాపకాలు

పోస్ట్‌తో పాటు ఎన్టీఆర్ బఘీరాతో గడిపిన కొన్ని మధుర జ్ఞాపకాల ఫోటోలను కూడా పంచుకున్నారు. బఘీరాను ఎంతో ప్రేమగా హగ్ చేసుకున్న దృశ్యాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా చివరి ఫోటోలో బఘీరా జ్ఞాపకార్థం ఒక మొక్కను నాటిన దృశ్యం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha