Dailyhunt
పెంచిన ఆస్తి పన్నులు రద్దుచేయాలి: సిపిఎం

పెంచిన ఆస్తి పన్నులు రద్దుచేయాలి: సిపిఎం

వార్త 1 week ago

AP Property Tax Hike: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి ఇంటి పన్ను (ఆస్తి పన్ను) లను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతూ రాష్ట్రంలోని పట్టణ ప్రజలపై రూ.400 కోట్ల భారం మోపడం దుర్మార్గమైన చర్య అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు చిగురుపాటి బాబూరావు అన్నారు.

ఆస్తి పన్నుల పెంపు, క్యాపిటల్ వాల్యూ విధానం రద్దు కోసం పౌర సంఘాలు, ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధం కావాలని, ఇందుకు సిపిఎం అండగా ఉంటుందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఆస్తి విలువ ఆధారిత ఇంటి పన్ను విధానం రద్దు, పెంచిన పన్నుల తగ్గింపు అంశాన్ని అజెండాగా చేసుకొని, ప్రజా ప్రతినిధులను, నేతలను రాష్ట్ర ప్రజలు నిలదీయాలని కోరారు.

Read also: Telangana MP Seats: తెలంగాణకు అదనంగా 13 ఎంపీ సీట్లు: సీఎం రేవంత్ రెడ్డి

CPM leader Babu Rao speech on house tax

AP Property Tax Hike: తప్పుడు రాయితీలతో ప్రజలను మోసం చేయొద్దు

విజయవాడ గవర్నర్పేటలోని శ్రీశ్రీ భవన్లో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాధ్ కలిసి విలేకరులతో బాబూరావు మాట్లాడారు. ఆస్తి విలువ ఆధారిత ప్రకారం.. 2021 22 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటికీ 130 శాతం పట్టణాల్లో ఇంటి పన్నులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. తొలుత 15శాతంతో ప్రారంభమై, ఈ సంవత్సరం 30శాతం పన్నులు పెరిగాయని, రాబోయే రెండేళ్లలో 45 శాతానికి చేరతాయని పేర్కొన్నారు. 30 శాతం వరకు ఇంటి పన్నులు పెంచి ఏప్రిల్ నెలాఖరులోపు పన్నులు చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ఇస్తామని ప్రకటించడం మోసపూరిత చర్య అన్నారు. రాష్ట్రంలోని 123 పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్న కోటి 50 లక్షల మంది ప్రజలపై ఇంటి పన్ను పెంపు భారం ప్రత్యక్షంగా, పరోక్షంగా పడుతోందని అన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

పరిశ్రమల ఏర్పాటుపై చంద్రబాబు కీలక సమీక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha