Kalyandurgam News: పెన్షనర్ల అపరిష్కృత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి.జిల్లా ఖజానాధికారి దృష్టికి తీసుకెళ్లిన కళ్యాణదుర్గం విశ్రాంత ఉద్యోగుల సంఘం.
సమస్యల పరిష్కారానికి సానుకూల హామీ ఇచ్చిన జిల్లా ఖజానాధికారి రమణయ్య.
Kalyandurgam News: పెన్షనర్లు ఎదుర్కొంటున్న వివిధ అపరిష్కృత సమస్యలను వెంటనే పరిష్కరించాలని కళ్యాణదుర్గం విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు జిల్లా ఖజానాధికారి రమణయ్యను కోరారు. బుధవారం కళ్యాణదుర్గం ఉప ఖజానా కార్యాలయాన్ని సందర్శించిన జిల్లా ఖజానాధికారిని సంఘ అధ్యక్షుడు మల్లికార్జున, కార్యదర్శి తిప్పేస్వామి తదితరులు కలిసి పెన్షనర్ల సమస్యలపై వివరంగా చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పెన్షనర్ల మరణానంతరం ప్రభుత్వం చెల్లించే అంత్యక్రియల ఆర్థిక సహాయం విడుదలలో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. దీంతో మృతుల కుటుంబ సభ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. అలాగే కుటుంబ పెన్షన్ మంజూరు సమయంలో కుటుంబ పెన్షనర్ల పుట్టిన తేదీలను సక్రమంగా నమోదు చేయకపోవడం వల్ల 80 ఏళ్లు దాటిన వారికి వర్తించే అదనపు పెన్షన్ (Additional Quantum of Pension) ప్రయోజనాలు అందడం లేదని పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి సారించి అర్హులైన వారికి వెంటనే ప్రయోజనాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ప్రకటించిన 30 నెలల కరువు భృతి (డీఏ బకాయిలు) ఇప్పటికీ అనేక మంది పెన్షనర్లు, వారి వారసుల ఖాతాల్లో జమ కాలేదని, దీనివల్ల వృద్ధులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. పెండింగ్‌లో ఉన్న బకాయిలను త్వరితగతిన విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వారి వినతిపై స్పందించిన జిల్లా ఖజానాధికారి రమణయ్య, పెన్షనర్ల సమస్యలను అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సంబంధిత అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉప ఖజానా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఏవైనా క్లిష్టమైన సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పెన్షనర్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని జిల్లా ఖజానాధికారి పేర్కొన్నారు.
Epaper: epaper.vaartha.com
వ్యాపార విస్తరణకు టీజీఎస్‌ఆర్టీసీ 'గోల్డెన్ ఛాన్స్' ..అద్దెకు ఖాళీ ఆర్టీసీ కమర్షియల్ కాంప్లెక్స్‌లు

