Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పేపర్ లీక్తో గందరగోళంలో విద్యార్థులు

పేపర్ లీక్తో గందరగోళంలో విద్యార్థులు

వార్త 1 week ago

Paper leak: పేపర్ లీక్ జరిగే అవకాశం లేకుండా సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి సాధించినప్పటికి కూడా ఏదో రూపేణా ఈ లాలూచీలు సంభవిస్తూనే ఉండటం అత్యంత దురదృష్టకరం!

ఈ పేపర్లీక్ వ్యవహారం అనేది ఈ రోజుది కాదు. గతంలో సైతం పలు సందర్భాలలో విద్యా ర్థుల బంగారు భవిష్యత్తో ఈ పేపర్ లీక్ వ్యవహారం ఆటలాడుకున్న విషయం మనందరికీ విదితమే. ముఖ్యంగా పేపర్ లీక్ జరిగే అవకాశం ఏ మాత్రం జరుగని రీతిలో సాంకేతికంగా మనం ఎంతో అభివృద్ధి పథంలో పయనిస్తు న్నప్పటికి ఈ సమాజంలో లాలూచి పడే వ్యక్తులు ఏదో ఒక మూలాన ఉండటం వలన ఇప్పటికి ఏదో ఒక సంద ర్భంలో పబ్లిక్ పరీక్షల సమయాన ఏదేని సబ్జెక్టుకు సం బంధించి ఈ పేపర్ లీక్ ఉదంతం సంభవిస్తూ బాగా కష్ట పడి చదివే విద్యార్థులు నోట్లో మట్టి కొట్టేలా ఈఅనారోగ్య వాతావరణం పొడచూపుతుండటం నిజంగా అత్యంత దురదృష్టకరమైన విషయం. ఇందుకు ప్రధాన కారణం ఈ సమాజంలో ఆర్థికంగా, రాజకీయంగా బాగా పలుకుబడి వున్నవ్యక్తుల అండదండలతో దానికి సంబంధించిన శాఖ లో పనిచేసే వ్యక్తులు డబ్బుకు ఆశపడి తిన్నింటి వాసాలు లెక్కబెట్టే రీతిలో వ్యవహారిస్తూ మన భారతదేశ విద్యా వ్యవస్థకే, పబ్లిక్ పరీక్షలు నిర్వహించే వారి ఉనికినే భ్రష్టు పట్టించేలా వ్యవహరించే వారి తీరుతెన్నులు ఈ ప్రజాస్వా మ్యానికి సంబంధించి ఓ సిగ్గుచేటైన, హేయమైన విషయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Read Also: NEET-UG 2026: ఒక్కో పేపర్‌కు రూ. 5 లక్షల డీల్.. సికార్ కోచింగ్ సెంటర్లే టార్గెట్!

 Paper leak

Paper leak: విద్యార్థుల మెడకు ఖచ్చితంగా ఒక ఉరికంభం

అలాగే తెలంగాణ రాష్ట్రంలో సైతం నీట్ పరీక్షా పేపర్ లీక్ వ్యవహారం ఒకటి బయటకు రావడం ఒక పెను సంచలనానికి కారణభూత మైంది. కనీసం తరచుగా సంభవిస్తున్న ఈ చేదు అనుభ వాలను దృష్టిలో పెట్టుకొని అయిన విద్యాశాఖకు చెందిన వారు గాని పబ్లిక్ పరీక్షలు నిర్వహించే బోర్డు వారిలో ఎవ రైనా గాని లేక ఆయా శాఖకుచెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఇలాంటి అనారోగ్య, అనాగరిక రీతిలో ఒకవేళ కాసులకు కకృతి పడి మరీ ఈ పేపర్ లీక్ వ్యవహారంలో పాలుపంచుకుంటే మాత్రం అంతకు మించిన పాపంవారికి మరొకటి ఉండదు. ఎందుకంటే పబ్లిక్ పరీక్షల సమయాన ఈ పేపర్ లీక్ ఉదంతాలు బయటకు పొక్కితే మాత్రం అనవసరంగా బాగా చదువుకునే విద్యార్థుల, సరస్వతి పుత్రుల ప్రిపరేషన్ పై అది తీవ్ర ప్రభావం చూపి వారి చదువు ఆటకేక్కే ప్రమాదం సైతం బాగా పొంచి ఉంటుంది. ఎలాగంటే బాగా డబ్బు, పలుకుబడి ఉండి విద్య సరిగా అబ్బని విద్యార్థుల కోసం ఇలాంటి చట్టవిరుద్ధమైన పేపర్ లీకు ఎవరైనా ఉపక్రమిస్తే ఎంతైనా అది బాగా చదువులో ముందుండే వేలాది మంది విద్యార్థుల మెడకు ఖచ్చితంగా ఒక ఉరికంభం, ఒక ఉరికొయ్యను బిగించడం క్రిందకు వస్తుంది తప్ప మరొకటి కాదు.

 Paper leak

విద్యార్థుల భవిత అధోగతిపాలు

ఏదిఏమైన మన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఆయా విద్యాశాఖమా త్యులు, ఆయా రంగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు, పబ్లిక్ పరీక్షలు నిర్వహించే బోర్డు పెద్దలు ఈ పేపర్ లీక్ వ్యవహారం విషయంలో మరోసారి ఎంతమాత్రం తప్పు దొర్లకుండా చట్టరీత్యా అత్యంత కఠినంగా వ్యవహారించాల్సి న గురుతర బాధ్యత వారందరిపై ఎంతైనా వుంది. ఏమైనా తరచుగా సంభవిస్తున్న ఈ పేపర్ లీక్ వ్యవహారం మన భారతదేశ విద్యా వ్యవస్థకే ఒక మాయని మచ్చ వంటిది. ఒక విధంగా ఈ అనారోగ్య వాతావరణం పొడచూపడం అనేది మన విద్యావ్యవస్థ కీర్తి, ప్రతిష్టలకే ఖచ్చితంగా మసక బార్చే వ్యవహారం ఈపేపర్ లీక్ ఉదంతం. ఇందులో ఎలాం టి సందేహానికి తావులేదు. అన్నింటికి మించి మున్ముందు రాబోయే అకాడమిక్సంవత్సరం లోనైనా ఈ పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీపరీక్షలలో విద్యావ్యవస్థకు ఇలాం టి అప్రతిష్ట తెచ్చే ఈ పేపర్ లీక్ వ్యవహారం తలెత్తకుండా విద్యార్థుల భవిత అధోగతిపాలు కాకుండా చట్టరీత్యా చాలా కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర విద్యా శాఖ వారిపై, పబ్లిక్ పరీక్షలు నిర్వహించే బోర్డు అధికారులపై ఎంతైనావుంది. రేపటి మన భారతదేశఅభివృద్ధిలో పాలు పంచుకోబోయేమన సరస్వతి పుత్రుల, జీవితాలు ఉజ్వలంగా మరో పదికాలాలపాటు దిగ్విజయంగా వర్ధిల్లాలి!

-బుగ్గన మధుసూదనరెడ్డి

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

నీట్ పేపర్ లీక్ కేసులో బ్యూటీ పార్లర్ గుట్టురట్టు: మనీషా వాఘ్మారే అరెస్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha