Dailyhunt
పెరిగిన జీతం పన్ను భారంగా మారుతోందా?

పెరిగిన జీతం పన్ను భారంగా మారుతోందా?

వార్త 2 weeks ago

Marginal Relief: సాధారణంగా ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చినా లేదా జీతం పెరిగినా ఎవరైనా సంతోషిస్తారు. కానీ, మన దేశంలోని కొత్త ఆదాయపు పన్ను విధానం (New Tax Regime) ప్రకారం, కొన్నిసార్లు స్వల్పంగా పెరిగిన జీతం మీ జేబుకు చిల్లు పెట్టవచ్చు.

అంటే, మీకు పెరిగిన జీతం కంటే మీరు కట్టే పన్ను మొత్తం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దీనినే పన్ను పరిభాషలో ‘మార్జినల్ రిలీఫ్’ (Marginal Relief) సమస్య అంటారు. ఆదాయం పెరిగినప్పుడు పన్ను స్లాబులు మారడం వల్ల కలిగే ఈ అదనపు భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ వెసులుబాటును కల్పిస్తుంది.

Read also: Gratuity Rules: గ్రాట్యుటీ రూల్స్‌లో కీలక మార్పులు

 income-tax-marginal-relief-explained-new-tax-regime-tips

మార్జినల్ రిలీఫ్ అంటే ఏమిటి? ఉదాహరణతో విశ్లేషణ

కొత్త పన్ను విధానంలో రూ. 12 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి రిబేట్ లభిస్తుంది, అంటే పన్ను సున్నా. అయితే ఆదాయం రూ. 12 లక్షలు దాటిన వెంటనే పన్ను భారం పడుతుంది. ఉదాహరణకు, ఒక వ్యక్తి వార్షిక ఆదాయం రూ. 13.40 లక్షలు అనుకుందాం. రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ పోగా, పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 12.65 లక్షలు అవుతుంది. దీనిపై లెక్కల ప్రకారం రూ. 69,750 పన్ను పడాలి. కానీ, రూ. 12 లక్షల పరిమితి కంటే ఆదాయం కేవలం రూ. 65,000 మాత్రమే ఎక్కువగా ఉన్నందున, ప్రభుత్వం పన్నును కూడా రూ. 65,000 కే పరిమితం చేస్తుంది. దీనినే మార్జినల్ రిలీఫ్ అంటారు.

పెరిగిన పదివేల జీతం.. రూ. 6,250 అదనపు పన్ను!

ఒకవేళ అదే వ్యక్తి జీతం రూ. 13.50 లక్షలకు పెరిగితే (అంటే కేవలం రూ. 10,000 పెంపు), పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 12.75 లక్షలు అవుతుంది. దీనిపై పన్ను రూ. 71,250 పడుతుంది. ఇక్కడ మార్జినల్ రిలీఫ్ వర్తించదు. అంటే, కేవలం పదివేల రూపాయల జీతం పెరగడం వల్ల, ఆ వ్యక్తి అదనంగా రూ. 6,250 పన్ను కట్టాల్సి వస్తోంది. ఫలితంగా పెరిగిన జీతంలో 60 శాతానికి పైగా పన్ను రూపంలోనే పోతుంది. ఇలాంటి సందర్భాల్లో పన్ను ప్లానింగ్ అత్యవసరం.

Marginal Relief: పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి చిట్కాలు

కొత్త ట్యాక్స్ విధానంలో ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ అదనపు భారం నుండి బయటపడవచ్చు:

  • స్టాండర్డ్ డిడక్షన్ వినియోగం: రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను సరిగ్గా లెక్కించి మీ ట్యాక్సబుల్ ఆదాయాన్ని తగ్గించుకోండి.
  • బోనస్ ప్లానింగ్: మీ ఆదాయం పన్ను పరిమితికి (Threshold) దగ్గరగా ఉంటే, బోనస్‌లు లేదా వేరియబుల్ పేమెంట్లను తదుపరి ఆర్థిక సంవత్సరానికి వాయిదా వేయడంపై ఆలోచించండి.
  • విధానాల పోలిక: మీ పెట్టుబడులు, మినహాయింపులను బట్టి పాత పన్ను విధానం (Old Regime) మేలా లేక కొత్తదా అనేది ముందే సరిచూసుకోండి.
  • నిపుణుల సలహా: ఆదాయం పెరిగినప్పుడు వచ్చే ఇలాంటి పన్ను చిక్కులను నివారించడానికి ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

సెయిల్ సీఎండీ అమరేందు ప్రకాశ్ రాజీనామా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha