ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎమ్)(Jaish-e-Mohammed) తన కార్యకలాపాల కోసం సరికొత్త, ప్రమాదకరమైన వ్యూహానికి తెరతీసింది. భద్రతా దళాల ఆపరేషన్లతో తీవ్రంగా దెబ్బతినడం, పాకిస్థాన్ నుంచి నిధుల ప్రవాహం పూర్తిగా నిలిచిపోవడంతో..
స్థానికంగానే డబ్బు సంపాదించాలని తన కేడర్‌ను ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌తో పాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీ నగరాల్లోని ధనవంతులను లక్ష్యంగా చేసుకుని కిడ్నాపులు, బెదిరింపు వసూళ్లకు పాల్పడాలని ప్రణాళికలు రచిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. గతంలో జరిగిన 'ఆపరేషన్ సిందూర్'లో జైషే మహ్మద్ నెట్‌వర్క్ చిన్నాభిన్నమైంది. సంస్థ చీఫ్ మసూద్ అజర్ కుటుంబసభ్యులు కూడా పలువురు హతమయ్యారు. దీనికి తోడు, సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేయడంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుంచి ఉగ్రవాదుల చొరబాట్లు దాదాపు అసాధ్యంగా మారాయి.
Read Also: Amaravati Pipes Fire Case: కోట్లు విలువైన పైపులు దగ్ధం.. కాపలాదారుడి పనే!
Jaish-e-Mohammed
Jaish-e-Mohammed: డబ్బుతో కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపా
ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారుల ప్రకారం, జమ్మూకశ్మీర్‌తో పాటు పంజాబ్, హర్యానా, ఢిల్లీలోని సంపన్నుల జాబితాను సిద్ధం చేసి, వారిని బెదిరించి డబ్బులు గుంజేందుకు ఈ వర్కర్లు ప్రయత్నిస్తున్నారు. అవసరమైతే వారి పిల్లలను కిడ్నాప్ చేసి భారీగా డబ్బు డిమాండ్ చేయాలని కూడా చూస్తున్నారు. ఇలా సమకూరిన డబ్బుతో కశ్మీర్‌లో మళ్లీ ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేయాలన్నది వారి ప్రణాళిక. ఇటీవల పంజాబ్‌లోని మొహాలీలో ఓ డ్రైవర్‌ను హత్య చేసి, కారును దొంగిలించిన కేసులో జైషే మాడ్యూల్‌ను పోలీసులు ఛేదించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

