మరణం అంచున నిలబడినప్పుడే మన అసలైన జీవితమేంటో తెలుస్తుంది. మనం చేసిన తప్పులు.. పోగొట్టుకున్న అవకాశాలను గుర్తుచేస్తాయి. కానీ అప్పటికే సమయం మించిపోవడంతో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉండదు.
అందుకే చావు భయాన్ని ముందే రుచి చూపించి, జీవితంపై ఒక స్పష్టత కల్పించే వినూత్న థెరపీ ఇప్పుడు జపాన్‌లో ట్రెండింగ్‌గా మారింది. అదే. కాఫిన్ సెషన్స్. చనిపోవడానికి ముందే శవపేటికలో కొంతసేపు పడుకునే అనునభవం ద్వారా జీవితం విలువను తెలుసుకునేలా చేసే ఈ ప్రయోగం ఇప్పుడు యూత్‌ను విశేషంగా ఆకట్టుకుంటుంది.
Read Also: Microsoft: మైక్రోసాఫ్ట్ కొత్త ఏఐ మోడళ్లు విడుదల
Japan Coffin Sessions
Japan Coffin Sessions: సంగీతంతో రిలాక్స్ అయ్యే వెసులుబాటు
టోక్యోలోని పలు వెల్‌నెస్ సెంటర్లు, ఫ్యునరల్ హోమ్స్ ఈ కాఫిన్ సెషన్స్ సేవలను అందిస్తున్నాయి. ఈ సెషన్‌లో భాగంగా ఒక చీకటి గదిలో పూలతో అలంకరించిన శవపేటికను ఏర్పాటు చేస్తున్నారు. మనం అందులో పడుకోగానే దాని మూతను గట్టిగా మూసివేస్తారు. అప్పుడు ఆ శవపేటికలో చిమ్మచీకట్ల నడుమ నిశ్శబ్ద వాతావరణంలో దాదాపు 30 నిమిషాలు గడుపాలి. కావాలంటే సంగీతంతో రిలాక్స్ అయ్యే వెసులుబాటు కూడా కల్పిస్తారు. ఇలా గాఢాంధకారంలో ఏకాంతంగా గడపడం వల్ల మనిషికి తన అంతరాత్మతో మాట్లాడే అవకాశం లభిస్తుందని.. అప్పుడు మనలోని అనవసరపు భయాందోళనలకు సమాధానాలు దొరుకుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ ట్రెండ్ 2024లో మొదలైంది. జపాన్‌లో శతాబ్దాలుగా సేవలందిస్తున్న ఫ్యునరల్ హోమ్ కేఫిన్ కేఫ్ సర్వీస్‌ను ప్రారంభించింది. చావు భయాన్ని తగ్గించి, జీవితం పట్ల కొత్త ఆలోచనలు కల్పించడమే లక్ష్యంగా కేఫె సెషన్ ప్రారంభించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. థాయ్‌లాండ్‌లో కూడా డెత్ ఫెస్ట్‌తో జరిగే ఈవెంట్లు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
చైనా వ్యూహం ఫలించేనా? పాక్-ఆఫ్ఘన్ చర్చలపై మావో నింగ్ కీలక వ్యాఖ్యలు

