Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెరుగుతున్న పిల్లల మిస్సింగ్ కేసులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

పెరుగుతున్న పిల్లల మిస్సింగ్ కేసులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం

వార్త 14 hrs ago

Supreme Court: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పిల్లల మిస్సింగ్ కేసులు పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలను పోలీసులు కేవలం అదృశ్య కేసులుగా చూడకుండా, కిడ్నాప్ కేసులుగా నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

తమిళనాడులో జరిగిన ఒక ఘటనపై విచారణ చేపట్టిన ధర్మాసనం, చిన్నపిల్లల రక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతగా వ్యవహరించాలని ఆదేశించింది.

Read also: Stewart McLean: ప్రముఖ నటుడు స్టీవర్ట్ మెక్‌లీన్ దారుణ హత్య.. అసలేం జరిగింది?

 Missing Children Cases as per Supreme Court Directives

మిస్సింగ్ కేసులపై కఠిన దర్యాప్తు అవసరం

పిల్లలు అదృశ్యమైనప్పుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని న్యాయస్థానం అభిప్రాయపడింది. ప్రతి మిస్సింగ్ కేసు వెనుక పెద్ద ముఠాలు ఉండే అవకాశం ఉందని, అందుకే వీటిని కిడ్నాప్ కేసులుగా పరిగణించి వెంటనే స్పందించాలని సూచించింది. దేశవ్యాప్తంగా పిల్లల భద్రతను నిర్ధారించడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని, దీనిలో ఎలాంటి జాప్యం జరగకూడదని న్యాయమూర్తులు హెచ్చరించారు.

Supreme Court: రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు సూచనలు

పిల్లల అదృశ్యంపై నమోదయ్యే ప్రతి ఫిర్యాదును గంభీరంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మిస్సింగ్ కేసుల దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, బాధితులకు తక్షణ న్యాయం అందేలా చూడాలని కోరింది. చిన్నపిల్లల ప్రాణాలు, వారి భవిష్యత్తు దృష్ట్యా ప్రతి కేసును అత్యవసరంగా భావించి, నిందితులను పట్టుకునేలా చర్యలు వేగవంతం చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha