Petrol Export Tax: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై విధించే విండ్‌ఫాల్ పన్నుల్లో మార్పులు చేసింది. పెట్రోల్ ఎగుమతులపై పన్నును లీటరుకు రూ.0.50 నుంచి రూ.2.50కు పెంచగా, డీజిల్ ఎగుమతులపై సుంకాన్ని రూ.16 నుంచి రూ.8.50కు తగ్గించింది.
ఈ సవరించిన పన్నులు అక్టోబర్ 16 నుంచి అమల్లోకి వస్తాయని గురువారం ఆలస్యంగా జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు సమాచారం.
Read Also :Rice Prices Hike: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న బియ్యం ధరలు.. ఇక కొనడం కష్టమేనా?
పెట్రోల్ ఎగుమతులపై పన్ను పెంపు

పెట్రోల్ ఎగుమతులపై విధిస్తున్న విండ్‌ఫాల్ పన్నును కేంద్రం లీటరుకు రూ.2 పెంచింది. దీంతో గతంలో రూ.0.50గా ఉన్న పన్ను ఇప్పుడు రూ.2.50కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్రోలియం ఉత్పత్తుల ధరల్లో చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, డీజిల్ ఎగుమతులపై విధించే సుంకాన్ని కేంద్రం తగ్గించింది. గతంలో లీటరుకు రూ.16గా ఉన్న సుంకాన్ని రూ.8.50కు తీసుకొచ్చింది. అంటే లీటరుకు రూ.7.50 మేర తగ్గించింది.
Petrol Export Tax: అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మార్పులు
అంతర్జాతీయ ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల్లో మార్పులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ సుంకాలను సవరించింది. ఈ నిర్ణయం ప్రధానంగా ఎగుమతులపై విధించే పన్నులకు సంబంధించినది. కాబట్టి పెట్రోల్, డీజిల్ ఎగుమతి పన్నుల్లో మార్పులు చేసినంత మాత్రాన దేశీయ పెట్రోల్ బంకుల్లో ధరలు వెంటనే పెరుగుతాయని లేదా తగ్గుతాయని చెప్పలేం.

