Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పెట్రోల్, గ్యాస్ భారం.. కేంద్ర నిరంకుశ విధానాలపై జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు

పెట్రోల్, గ్యాస్ భారం.. కేంద్ర నిరంకుశ విధానాలపై జూన్ 9న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు

వార్త 4 months ago

AP Petrol price hike: దేశంలో నిరంకుశ చర్యలు, పౌరహక్కులు, ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని సీపీఎం కార్యదర్శి వి. శ్రీనివాసరావు ఆరోపించారు. గురువారం సిపిఎం రాష్ట్ర రాష్ట్ర కార్యాలయంలో వామపక్ష పార్టీల సమావేశం జరిగింది.

సిపిఐఎంఎల్ నాయకులు జాస్తి కిషోర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు హరినాథ్ రెడ్డి, సిపిఐఎంఎల్ న్యూడెమెక్రసీ నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, పొలారి, సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు హరినాథ్, ఎంసిపిఐయు నాయకులు గణేష్ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొనలేకపోయిన ఆరఎస్పి, ఫార్వార్డ్ బ్లాక్, న్యూడెమెక్రసీ, ఎసుసిఐ(సి) నాయకులు సమావేశ నిర్ణయాలకు మద్దతు ప్రకటించారు. అనంతరం బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ దేశంలో నిరంకుశ చర్యలు, పౌరహక్కులు, ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని
తెలిపారు.

Read also: TDP Mahanadu Donations: మహానాడుకు కాసుల వర్షం.. ఏకంగా రూ. 25.61 కోట్ల విరాళాలు

 protest against petrol gas price hike

ఇటీవల కాలం ను పెంచుతున్నట్లు వచ్చిన వార్తల పట్ల సమావేశం ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి వ్యతిరేకంగా జూన్ 1 నుండి ఏడోతేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా విసృత ప్రచారం కరపత్రాల పంపిణీ, సమావేశాలు, సదస్సుల రూపంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. కేజీ బేసిన్ గ్యాస్ సాధన కోసం పాశర్లపూడి ప్రాంతంలో వామపక్షాలు జూన్ మొదటివారంలో పర్యటిస్తాయని వివరించారు. కేంద్రం పెట్రోలు ధరలను రోజువారీ లెక్కన పెంచుతోందని, దీనివల్ల రోజువారీ ఉపాధిపై ప్రభావం పడుతోందని, రోజువారీ కూలీలు, చిన్న ఉద్యోగులు, తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. కేరళం మాజీ సిఎం పినరయి విజయన్పై దాడి వెనుక కేంద్రం కుట్ర ఉందని శ్రీనివాసరావు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను జేబు సంస్థలుగా మార్చి ప్రతిపక్ష నేతలపై దాడులకు ఉసిగొల్పుతున్నారని, ప్రజలు దీన్ని చూస్తూ ఊరుకోరని తెలిపారు. కేంద్రం యువత విషయంలో వ్యవహరిస్తున్న విధానాలపై ఆగ్రహంతో వ్యంగ్యాస్త్రంగా ప్రారంభమైన కాక్రోచ్ జనతాపార్టీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోందని తెలిపారు.

AP Petrol price hike:ధరల పెరుగుదలతో సామాన్యుడిపై భారం

ప్రజల్లో అసంతృప్తి ఏజెండాగా ముందుకు వచ్చిందని తెలిపారు. దీన్ని సహించలేని కేంద్రం ఒకవైపు కాక్రోచ్ జనతాపార్టీ ఎక్స్ ఖాతాలను బ్లాక్ చేయించి మరోవైపు దీన్నుండి దృష్టి మళ్లించడానికే విజయన్ ఇంటిపై దాడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతను చూసి ప్రభుత్వం ఎంత భయపడుతుందో దీన్ని బట్టే అర్థం అవుతుందని పేర్కొన్నారు. అవినీతిపరులు బిజెపిలో చేరితే పునీతులు: సిపిఐ నాయకులు హరినాథ్ రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా అవినీతిపరులని ముద్రలు వేసిన బిజెపి వారి పార్టీలో చేరగానే పునీతులు అన్నట్లు ముఖ్యమంత్రి పదవులు కట్టబెడుతోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు పి.హరినాథ్ రెడ్డి అన్నారు. ప్రస్తుత బెంగాల్, అస్సాం సిఎం ఇద్దరూ గతంలో అవినీతి కేసుల్లో ఉన్నారని, బిజెపిలో చేరగానే నిజాయితీ పరులంటూ సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారని వివరించారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీల నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని వివరించారు

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గత ప్రభుత్వ తీరుపై టీడీపీ సీనియర్ కార్యకర్త ఈ. నిరంజన్ ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha