Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీఆర్‌తో జీడీపీ చిత్రాన్ని అందంగా చూపించవచ్చు: కాంగ్రెస్

పీఆర్‌తో జీడీపీ చిత్రాన్ని అందంగా చూపించవచ్చు: కాంగ్రెస్

వార్త 2 weeks ago

Cong Slams Modi Govt Over GDP : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విడుదల చేస్తున్న జీడీపీ (GDP) గణాంకాలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

పబ్లిక్ రిలేషన్స్ (PR) ప్రచారాలతో జీడీపీ అంకెలను అందంగా మార్చవచ్చేమో కానీ, దేశంలో ఉన్న అసలైన ఆర్థిక పరిస్థితులను మార్చలేరని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. కేంద్ర మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ మాట్లాడిన వీడియోను జైరాం రమేశ్ తన ‘ఎక్స్’ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు. ఆ వీడియోలో గార్గ్ చేసిన కీలక వ్యాఖ్యలు:గతేడాది జీడీపీ గణాంకాలను దాదాపు రూ.6 లక్షల కోట్లు తగ్గించి చూపించారు.దీనివల్ల ప్రస్తుత త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 10.3 శాతం పెరిగినట్లు కనిపిస్తోంది.ఒకవేళ గతేడాది జీడీపీని మార్చకుండా ఉండి ఉంటే, ప్రస్తుత ధరల ప్రకారం నిజమైన వృద్ధి రేటుకేవలం 2.6 శాతంగా ఉండేదని గార్గ్ వివరించారు.

Read Also: Ration Card Updates: రేషన్ కార్డు ఈ-కేవైసీ మొబైల్ ప్రాసెస్

 Cong Slams Modi Govt Over GDP

Cong Slams Modi Govt Over GDP : ‘అంకెల గారడీ’పై జైరాం రమేశ్ విమర్శలు

మోదీ ప్రభుత్వం మరియు మీడియా ఎంత ప్రచారం చేసుకున్నా అసలు నిజం త్వరలోనే బయటపడుతుందని జైరాం రమేశ్ వ్యాఖ్యానించారు.ప్రభుత్వ గణాంకాలకు, సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న రోజువారీ ఆర్థిక పరిస్థితులకు అస్సలు పొంతన లేదని అన్నారు.బలమైన ఆర్థిక వ్యవస్థ అనేది అబద్ధాల పునాదిపై రాదని, నిజాన్ని ఒప్పుకోవడం ద్వారానే సాధ్యమవుతుందని సూచించారు.యువతకు ఉద్యోగాలు కల్పించడం, చిన్న పరిశ్రమలను ప్రోత్సహించడం, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడం ద్వారానే నిజమైన వృద్ధి వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ మీడియా విభాగం హెడ్ పవన్ ఖేరా కూడా ఈ అంశంపై స్పందించారు.నిత్యావసర ధరల పెరుగుదల, కొనుగోలు శక్తి తగ్గడం, పొదుపు పడిపోవడం, నిరుద్యోగం, కుటుంబాల అప్పుల భారం పెరగడమే దేశంలో ఉన్న నిజమైన పరిస్థితి అని పేర్కొన్నారు.ప్రభుత్వం గతేడాది జీడీపీ అంకెలను ఎందుకు తగ్గించాల్సి వచ్చిందో, అసలైన జీడీపీ వృద్ధి ఎంతో ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మోదీ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ కంటే ‘ఫేక్ ఇన్ ఇండియా’నే ఎక్కువగా చేస్తోందని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

ఇందిరమ్మ ఇళ్ల తుది పరిశీలన అప్‌డేట్స్ ఇవే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha