Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
'పిఎంకిస్తాన్కు కొత్త ఊపిరి అవసరం

'పిఎంకిస్తాన్కు కొత్త ఊపిరి అవసరం

వార్త 1 week ago

PM Kisan : దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవ నాధారం. భారత ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక, సేవా రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, వ్యవసాయం ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు.

రైతు బలపడితేనే దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనే భావనతో కేంద్రప్రభుత్వం 2019 లో ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6,000 చొప్పున మూడు విడతల్లో రూ.2,000 చొప్పున నేరుగా బ్యాంకుఖాతాల్లో జమ చేస్తు న్నారు. ప్రారంభ సమయంలో ఇది రైతులకు కొంత ఉప శమనం కలిగించినా, నేటి పరిస్థితుల్లో ఈ మొత్తం రైతుల అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. 2019లో ఎరువుల ధరలు, విత్త నాల ఖర్చులు, కూలీల వేతనాలు, సాగు వ్యయాలు ఒక స్థాయిలో ఉండేవి. కానీ గత ఏడు సంవత్సరాల్లో వ్యవ సాయ రంగంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎరువుల ధరలు గణనీయంగా పెరిగాయి. డీజిల్ ధరలు పెరగడంతో సాగు ఖర్చులు అధికమయ్యాయి. వ్యవసాయ యంత్రాల వినియోగం పెరిగింది. ఆధునిక సాంకేతికతలు, డ్రిప్ ఇరిగేషన్, మైక్రో న్యూట్రియంట్స్, నాణ్యమైన విత్త నాల వాడకం వంటి అంశాలు రైతుల ఖర్చును మరింత పెంచాయి. ఈ పరిస్థితుల్లో ఇప్పటికీ 2019లో నిర్ణయిం చిన అదే రూ.6,000 మొత్తాన్ని కొనసాగించడం రైతులపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని పరిగణనలోకి తీసుకోనట్టే కని పిస్తోంది.

 PM Kisan

PM Kisan : రైతులు ఇప్పటికీ ఈ పథకం పరిధిలోకి రాలేకపోతున్నారు

ప్రస్తుతం ఒక ఎకరం వరి సాగుకు సగటున రూ.30,000 నుంచి రూ.50,000 వరకు ఖర్చు అవుతోంది. ఇతర పంటల సాగులో కూడా ఇదే పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో ఏడాదికి కేవలం రూ.6,000 ఇవ్వడం ద్వారా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించడం లేదు. అందువల్ల పీఎంకిసాన్ కింద అందించే ఆర్ధిక సహాయాన్ని కనీసం రూ.10,000 నుంచి రూ.12,000 వరకు పెంచా ల్సిన అవసరం ఉంది. రైతులకు అందే ఈ మొత్తం పెరి గితే సాగు ప్రారంభ సమయంలో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేయడానికి కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇంకా ముఖ్యంగా పథకం అమలులో ఉన్న నిబంధనలను కూడా పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది. పీఎంకిసాన్ ప్రారంభ సమయంలో భూ రికార్డుల్లో పేర్లు ఉన్న రైతులకే ప్రయోజనం అందింది. అయితే అనంతరం వారసత్వంగా భూములు పొందిన అనేక మంది రైతులు ఇప్పటికీ ఈ పథకం పరిధిలోకి రాలేకపోతున్నారు. కుటుంబ పెద్ద మర ణించిన తరువాత భూమి వారసుల పేర్లకు మారినా, వివిధ సాంకేతిక, పరిపాలనా కారణాలవల్ల కొత్త రైతులకు ప్రయో జనం అందడం లేదు. ఫలితంగా వాస్తవంగా వ్యవసాయం చేస్తున్న రైతులు కూడా పథకం నుంచి దూరమవుతున్నారు.

భూముల వారసత్వ మార్పిడి

గ్రామీణ ప్రాంతాల్లో భూముల వారసత్వ మార్పిడి ప్రక్రియ చాలా కాలం పడుతోంది. కొన్నిచోట్ల భూ వివాదాలు, రికా ర్డుల సవరణల ఆలస్యం, సాంకేతిక లోపాల కారణంగా రైతులు పీఎంకిసాన్ లబ్ధి పొందలేకపోతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వ హించి కొత్త వారసుల నమోదుకు అవకాశం కల్పించాలి. రెవెన్యూ, వ్యవసాయ శాఖల సమన్వయంతో భూమి వారసత్వ బదలీలు పూర్త యిన వెంటనే పీఎంకిసాన్లో స్వయంచాలక నమోదు జరిగే విధానం తీసుకురావాలి. కోవిడ్ మహమ్మారి తరు వాత వ్యవసాయ రంగంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. రైతుల ఆదాయం ఆశించినంతగా పెరగ లేదు. ప్రకృతి వైపరీత్యాలు, వాతావరణ మార్పులు, అని శ్చిత వరా లు, మార్కెట్ ధరల హెచ్చుతగ్గులు రైతులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు ప్రత్యక్ష నగదు సహాయం మరింత అవసరమైంది. అందుకే పీఎంకిసాన్ను కేవలం సంక్షేమ పథకంగాకాకుండా వ్యవసాయ స్థిరత్వానికి బలమైన మద్దతు పథకంగా మార్చా ల్సిన అవసరం ఉంది. రైతుల అభివృద్ధి కేవలం నగదు సహాయంతోనే సాధ్యంకాదు. బ్యాంకు రుణాల విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం మరింత చొరవ చూపాలి. ప్రస్తు తం కొన్ని రాష్ట్రాలు సున్నా వడ్డీ లేదా పావలా వడ్డీతో రైతులకు రుణాలు అందిస్తున్నాయి. అయితే దేశ వ్యాప్తంగా ఒకే విధానం లేదు. ఫలితంగా రాష్ట్రాన్ని బట్టి రైతులకు లభించే ప్రయోజనాలు మారుతున్నాయి.

రుణాల ప్రక్రి యను సులభతరం చేయాలి

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా చిన్న, సన్నకారు రైతులకు సున్నా వడ్డీతో వ్యవసాయ రుణాలు అందించే విధానాన్ని రూపొందించాలి. దీనివల్ల రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్దకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. వ్యవసాయ రుణాల మంజూరులో ఉన్న క్లిష్టమైన విధానాలను కూడా సరళీకరించాలి. చిన్న రైతులు బ్యాంకుల చుట్టూ తిరగకుండా గ్రామ స్థాయిలోనే రుణాల మంజూరు జరిగే విధంగా వ్యవస్థను బలోపేతం చేయాలి. రైతు భరోసా కేంద్రాలు, వ్యవసాయ విస్తరణ అధికారులు, బ్యాంకింగ్ ప్రతినిధుల ద్వారా రుణాల ప్రక్రి యను సులభతరం చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత పదేళ్లలో అనేక సంక్షే మ కార్యక్రమాలు అమలు చేసింది. పీఎంకిసాన్ కూడా వాటిలో ఒక ముఖ్యమైన పథకం. అయితే కాలానుగుణంగా పథకాలలో మార్పులు చేయడం కూడా అంతే అవసరం.

 PM Kisan

రైతు ఆర్థికంగా బలపడితేనే అభివృద్ధి ఫలాలు

2019లో నిర్ణయించిన ప్రమాణాలు 2026లో కూడా యథాతథంగా కొనసాగడం సమంజసం కాదు. రైతుల అవసరాలు, సాగు ఖర్చులు, ఆర్ధిక పరిస్థితులు మారిన ప్పుడు పథకాలూ మారాలి. పీఎంకిసాన్ మొత్తాన్ని పెంచ డం, కొత్త వారసత్వ రైతులను చేర్చడం, భూ రికార్డుల ఆధునీకరణ చేయడం, రైతులకు సున్నా వడ్డీ రుణాలు అందించడం, చిన్న సన్నకారు రైతులకు ప్రత్యేక ప్రోత్సా హకాలు ఇవ్వడం వంటి సంస్కరణలు అమలు చేస్తే ఈ పథకం మరింత ప్రభావవంతంగా మారుతుంది. రైతు ఆదాయం పెరగడం, వ్యవసాయం లాభదాయకంగా మార డం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడం వంటి లక్ష్యాలు కూడా సులభంగా సాధ్యమవుతాయి. దేశానికి అన్నం పెట్టే రైతు ఆర్థికంగా బలపడితేనే అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికీ చేరుతాయి. అందువల్ల పీఎం కిసాన్ పథకాన్ని ప్రస్తుత పరిస్థి తులకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరించి, రైతుల వాస్తవ అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిబం ధనలను సవరించ డం కాలానుగుణ అవసరంగా మారింది. రైతుకు భరోసా కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరింత ముందడుగు వేస్తే, అది వ్యవసాయ రంగానికే కాకుండా దేశ భవిష్యత్తుకూ మేలు చేస్తుంది.

-అప్పన్న గొనవ

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

యూరియా బుకింగ్ ఇక మరింత ఈజీ!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha