Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పిల్లల ఆకలి తీర్చిన బ్యాడ్మింటన్ స్టార్

పిల్లల ఆకలి తీర్చిన బ్యాడ్మింటన్ స్టార్

వార్త 1 week ago

Jwala Gutta Breast Milk Donation: ఒకప్పుడు బ్యాడ్మింటన్ కోర్టులో రాకెట్ పట్టి ప్రత్యర్థులను వణికించిన స్టార్ ప్లేయర్ గుత్తా జ్వాల, ఇప్పుడు ఒక తల్లిగా సమాజానికి అత్యంత అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు.

కన్న బిడ్డకే కాకుండా, తల్లిప్రేమకు నోచుకోని అనాథలు, ఆసుపత్రుల్లో చావుబతుకుల మధ్య ఉన్న పసిపాపల ఆకలి తీర్చి మాతృత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు.

Read Also:Virat Kohli Interview: 2027 వరల్డ్ కప్‌పై కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!

Jwala Gutta Breast Milk Donation: ఏడాదిలో 60 లీటర్ల తల్లిపాలు విరాళం

నేను ప్రసవించిన మొదటి సంవత్సరంలో హైదరాబాద్, చెన్నైలలోని ప్రభుత్వ ఆసుపత్రులకు సుమారు 60 లీటర్ల తల్లిపాలను విరాళంగా ఇచ్చాను!!దీనివల్ల వచ్చే మార్పు ఏంటి? దాతలు ఇచ్చే కేవలం 100 మిల్లీలీటర్ల (ml) తల్లిపాలు.. ఒక కిలో బరువున్న పసిపాపకు కొన్ని రోజుల పాటు ఆకలి తీర్చగలవు. ఈ విరాళం ఎంతోమంది నియోనాటల్ ఐసీయూ (NICU) లో ఉన్న శిశువులకు అండగా నిలవగలదు. పాలను విరాళంగా ఇవ్వడం అనేది సురక్షితమైనది, పూర్తిగా పరీక్షించబడినది మరియు ప్రస్తుతం దీని అవసరం ఎంతైనా ఉంది. కొన్ని అనారోగ్య సమస్యల వల్ల ఐసీయూ (NICU) లో ఉన్న చాలా మంది శిశువులకు వారి కన్నతల్లి పాలు వెంటనే అందుబాటులో ఉండవు.

అటువంటి క్లిష్టమైన మొదటి రోజుల్లో, దాతలు ఇచ్చే తల్లిపాలు ఆ పసిపాపలకు రోగనిరోధక శక్తిని, అవసరమైన పోషకాలను అందిస్తూ ఒక ప్రాణదాతగా మారుతాయి.మానసిక ఒత్తిడి, అనారోగ్యం, పోషకాహార లోపం లేదా నెలలు నిండకుండానే కాన్పు అవ్వడం వంటి కారణాల వల్ల పాలు పడటం ఆలస్యమయ్యే తల్లులకు.. ఈ విరాళంగా వచ్చిన పాలు ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉపయోగపడతాయి.నెలలు నిండకుండా పుట్టే పసిపిల్లలలో వచ్చే ‘నెక్రోటైజింగ్ ఎంట్రోకోలిటిస్’ (ఇది పేగులకు సంబంధించిన ప్రాణాంతక సమస్య) వంటి వ్యాధుల ముప్పును తగ్గించడంలో ఈ దాతల తల్లిపాలు ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయని నిరూపితమైంది!!! అని ట్వీట్ చేసారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ముంబై కోచ్ పొలార్డ్‌కు జరిమానా.. అసలేం జరిగిందంటే?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha