Dailyhunt
పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయ సమస్య

పిల్లల్లో పెరుగుతున్న స్థూలకాయ సమస్య

వార్త 1 week ago

Obesity : ఆ టపాటలు తక్కువైపోయాయి. వ్యాయామాల జోలికి వెళ్లే వారు మరీ తగ్గిపోయారు. జంక్ ఫుడ్ మాత్రం ఎక్కువైపోయింది. ఇది చాలా దేశాల్లో చిన్నారుల పరిస్థితి.

ఈ కారణాల వల్ల చిన్నతనంలోనే అనేక మంది బరువెక్కి పోతున్నారు. కేవలం పది దేశాల్లో లెక్కచూస్తే బడి ఈడు పిల్లల్లో 20 కోట్ల మందికి పైగా అధిక బరువుతో బాధ పడుతున్నట్టు అంచనా. కాలు బయటపెట్టడానికి ఇష్టపడకుండా అతికొద్ది మంది పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. చాలా మంది టీవీలు, ఫోన్లకు అంటిపెట్టుకుని ఉంటు న్నారు. దీనివల్ల ఎంతోమంది బాలబాలికలు స్థూలకాయం బారిన పడుతున్నారు. 2025లో ఇలాంటి వారి పరంగా చైనా తర్వాతి స్థానం ఇండియాదే. గత ఏడాది మనదేశంలో 5-౧౯ ఏళ్ల మధ్య పిల్లల్లో ఊబకాయంతో సతమతమవు తున్న వారి సంఖ్య 1.4 కోట్ల వరకూ ఉంది. చైనాలో ఈ సంఖ్య అత్యధికంగా 3.3కోట్లు ఉండగా ఇరాక్లో అత్య ల్పంగా 0.త్రీ కోట్లని వరల్డ్ ఒబెసిటీ అట్లాస్ 2026 తెలి పింది. 2022 లో ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఎనిమిది మందిలో ఒకరు ఊబకాయంతో జీవిస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ
వెల్లడించింది. అలాగే 1990 నుంచి వయో జనులలో ఊబకాయం రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగింది.

Read Also : Onion for heat stroke: జేబులో ఉల్లిపాయ ఉంటే వడదెబ్బ తగలదా..?

 Obesity

Obesity : ఆరోగ్య సమస్యలు

కౌమార దశలో ఉన్న వారిలో నాలుగు రెట్లు పెరిగింది. 2022లో 2.5 బిలియన్ల మంది వయోజనులు అధిక బరువు కలిగి ఉన్నారు. వీరిలో 89కోట్ల మంది ఊబకా యంతో జీవిస్తున్నారు. 18 సంవత్సరాలు పైబడిన వారిలో 43 శాతం మంది అధికబరువుతో ఉండగా, 16 శాతం మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. 2024లో అయిదేళ్ల లోపు వయసున్న 35 మిలియన్ల మంది పిల్లలు అధిక బరువుతో ఉన్నారు.ఆహారం, శక్తి వ్యయం మధ్య అసమతుల్యత వల్ల అధిక బరువు, ఊబకాయం సమస్య వస్తుంది. బాల్యం, కౌమార దశలో ఎక్కువ బరువు ఉండటం కారణంగా ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తున్నాయి. ఇవి జీవ నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. వివక్ష రావొచ్చు. వేధింపులూ తప్పకపోవచ్చు. ఊబకాయంతో ఉండే పిల్లలు పెద్దయ్యాక కూడా అదే విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వయోజన దశలో వీరికి అంటువ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం లేకపోలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనదేశం విషయానికే వస్తే పిల్లల్లో ఊబకాయం సమస్య రానురానూ పెరిగిపోతోంది. అయిదేళ్ల లోపు పిల్లల్లో అధిక బరువు 127 శాతం పెరిగినట్టు ఒక అధ్యయనం ద్వారా వెల్లడైంది. మరో నాలుగేళ్లలో భారత దేశంలో 27 మిలియన్లకు పైగా పిల్లలు, టీనేజర్లు ఊబకాయంతో సతమతం కావచ్చని అంచనా.

ఆహార అలవాట్లు

ఆధునిక జీవనశైలి అన్నివిధాలా చిన్నారులను దెబ్బతీస్తోంది. స్మార్ట్ఫోన్తో అదేపనిగా ఉండటం, మితిమీరి జంక్ ఫుడ్ తినడం, అటూ ఇటూ తిరిగే పనిలేకపోవడం వంటి కారణాలతో సమస్య మరింతగా పెరిగిపోతోంది. ఫలితంగా చిన్నతనంలోనే టైప్ 2 డయాబెటిస్, రక్తపోటు, ఫ్యాటీ లివర్ వ్యాధులు మీద పడుతున్నాయి. షుగర్ డ్రింక్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్, ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ పెరిగి కొవ్వు పేరుకుపోతుందని నిపుణులు చెబుతున్నారు. తగినంత నిద్ర లేకపోవడంకూడా ఓ కారణమే అని అంటున్నారు. ఏదో ఒకటి తినేసి పొట్ట నింపుకోవాలన్న తాపత్రయం చిన్నారుల్లో, టీనేజర్లలో ఎక్కువైపోయిందనీ, ఇది చాలా ప్రమాదకరమని చెబుతూ ముందు కుటుంబ పెద్దల్లో మార్పు అవసరమని సూచిస్తు న్నారు. పిల్లలకు అనుకరించే అలవాటు పెద్దవారి నుంచి వస్తుంది. తల్లితండ్రులను, వారి ఆహార అలవాట్లను చాలా మంది చిన్నారులు అనుసరిస్తూ ఉంటారు. కుటుంబంమొత్తం ప్రణాళికాబద్ధంగా జీవిస్తే తప్ప చిన్న పిల్లలు తమ పద్ధతి మార్చుకుంటారని అనుకోవడం పొరపాటే అవుతుంది. చదు వు ఒత్తిడి, పోటీతత్వం, సామాజిక ఆందోళనలు కూడా పిల్లలపై ప్రభావం చూపిస్తాయి.

 Obesity

నిద్ర లేకపోయినా..

పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి పోషకాలతో కూడిన ఆహారం చాలా అవసరం. కూరగాయలు, తాజా పండ్లు, తృణధాన్యాలు, పాలు సరైన మొత్తంలో తీసుకునేలా వారిని ప్రోత్సహించాలి. వాటిని తీసుకోవడం వల్ల లభించే మేలును అర్థమయ్యేలా వివరించి చెప్పగలగాలి. ఇది ఇంటి పెద్దలు తీసుకోవాల్సిన బాధ్యత అని గుర్తించాలి. జంక్ ఫుడ్, చక్కెర అధికంగా ఉండే వాటి ని పిల్లలకు వీలైనంత దూరంగా ఉంచాలి. శారీరక శ్రమ లేక పోవడం వల్ల అధిక బరువు సమస్య ఎదురవుతోంది. ఆటలు ఆడటం మంచిదని, సైక్లింగ్ చేయడం మరింత మంచిదని చెప్పి ప్రోత్సహించాలి. శారీరక శ్రమ పెరిగితే ఊబకాయం దానంతట అదే కొన్నాళ్ళకు దూరం అవుతుంది. తగినంత నిద్ర లేకపోయినా కూడా ఊబకాయం రావచ్చు. బరువు పెరగవచ్చు. నిద్ర లేమి కారణంగా శరీరంలో వాపు మొదలై బరువు పెరగడానికి ఆస్కారముంది. కనీసం రోజుకు ఎని మిదినుంచి తొమ్మిది గంటల పాటు నిద్ర ఉండేలా సమ యాన్ని నిర్ధారించే బాధ్యతను తల్లితండ్రులు తీసుకోవాలి. చదువు నిమిత్తం కంప్యూటర్, ఫోన్ వినియోగించుకోవడం లో తప్పు\లేదు. కానీ వేళకాని వేళల్లో దాన్ని వినోదం కోసం గంటల తరబడి ఉపయోగించడం ఆరోగ్యానికి నిస్సందే హంగా ముప్పే. దీనికి బదులు ఇంటి పనిలో సాయపడమని చెప్పండి.పుస్తకాలు చదివించండి. తోట పని చేస్తే కలిగే ఆనందం గురించి వివరించండి. ఇది కూడా పెద్దలు బాధ్యతే. పిల్లలకు ఆదర్శంగా నిలవండి. ముందు మీరు మారండి. ఆ తర్వాత మిమ్మల్ని చూసి వారే మారిపోతారు.

-జి. యోగేశ్వర్ రావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

మందార టీతో అద్భుతమైన ఆరోగ్య లాభాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha