Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీరియడ్స్ ఆలస్యం అయితే ఏంచేయాలి ?

పీరియడ్స్ ఆలస్యం అయితే ఏంచేయాలి ?

వార్త 3 weeks ago

Periods : పీరియడ్స్ ఆలస్యం కావడం అనేది ఈ రోజుల్లో చాలా మంది మహిళల్లో కనిపిస్తున్న సాధారణ సమస్య. దీనికి మానసిక ఒత్తిడి, జీవనశైలి మార్పులు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.

వైద్యుల అభిప్రాయం ప్రకారం, విపరీతమైన ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో ‘కార్టిసాల్’ అనే హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుంది. ఈ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల హార్మోనల్ బ్యాలెన్స్ తప్పి, నెలసరి క్రమం తప్పుతుంది. కేవలం ఒత్తిడి మాత్రమే కాకుండా, క్రమరహిత ఆహారపు అలవాట్లు మరియు తగినంత విశ్రాంతి లేకపోవడం కూడా ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. నెలసరి సమస్యను అధిగమించడానికి నిపుణులు సూచిస్తున్న కొన్ని ముఖ్యమైన చిట్కాలు మరియు జీవనశైలి మార్పులు.

Read Also : లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకోబోతున్నారా? ముందు ఇవి తెలుసుకోండి

పోషకాహారం మరియు బరువు నియంత్రణ

త్వరగా బరువు తగ్గాలనే ఆరాటంతో చాలా మంది తిండి సరిగ్గా తినడం మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు అందవు. ఫలితంగా నెలసరి ఆలస్యం కావడం లేదా పూర్తిగా ఆగిపోవడం (Amenorrhea) జరుగుతుంది. కాబట్టి బరువు తగ్గడానికి క్రష్ డైట్లు చేయకుండా, చక్కెర ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. శరీర బరువును ఎప్పుడూ అదుపులో (ఆరోగ్యకరమైన పరిధిలో) ఉంచుకుంటూ, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే సమతుల్య ఆహారాన్ని రోజువారీ మెనూలో భాగం చేసుకోవాలి.

తగినంత నిద్ర మరియు విశ్రాంతి

శరీరం సజావుగా పనిచేయడానికి మరియు హార్మోన్లు సమతుల్యంగా ఉండటానికి నిద్ర చాలా అవసరం. రోజూ రాత్రిపూట కనీసం 6 నుండి 8 గంటల పాటు ప్రశాంతమైన నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. సరైన నిద్ర లేకపోతే ఒత్తిడి హార్మోన్లు పెరిగి పీరియడ్స్ సైకిల్‌ను దెబ్బతీస్తాయి. నిద్రతో పాటు రోజూ క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామాలు లేదా యోగా చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, హార్మోన్ల వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి వస్తుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

మానసిక ఆరోగ్యం కోసం 10 నిమిషాలు ధ్యానం చేయాల్సిందే !!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha