Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పీసీ జ్యూవెలర్స్ ఇన్వెస్టర్లకు నిధుల వర్షం

పీసీ జ్యూవెలర్స్ ఇన్వెస్టర్లకు నిధుల వర్షం

వార్త 2 days ago

PC Jeweller Share Price:PC జ్యూవెల్లరీ షేర్స్ స్టాక్ మార్కెట్లో అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతున్నాయి. జూలై నుండి సెప్టెంబర్ త్రైమాసికంలో ఈ సంస్థ నికర లాభం 58 శాతం పెరిగి 330.66 కోట్లకు చేరింది.

గత సంవత్సరం ఇదే సమయంలో లాభం 209.54 కోట్లుగా నమోదైంది. సంస్థ మొత్తం ఆదాయం 28 శాతం పెరిగి 1054.47 కోట్లకు చేరుకుంది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఈ షేరు ధర ఒకే రోజు తొమ్మిది శాతం వరకు పెరిగి 20.17 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. ఎగుమతుల ద్వారా రావాల్సిన 142 కోట్ల పాత బాకీలు వసూలు కావడం కంపెనీకి పెద్ద ఉపశమనం అందించింది. గత ఆరు నెలల కాలంలో ఈ షేరు పెట్టుబడిదారులకు దాదాపు 98 శాతం రాబడిని ఇచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇప్పటి వరకు చూస్తే మొత్తం 108 శాతం వృద్ధి నమోదు చేసింది.

Gold Price : పండగ వేళా..భారీగా పెరిగిన బంగారం ధరలు

 Huge gains in PC Jeweller share price

అప్పులు లేని కంపెనీగా రికార్డు

ఈ త్రైమాసికంలో కంపెనీ సాధించిన అతిపెద్ద విజయం అప్పులు పూర్తిగా తీర్చివేయడం. 14 బ్యాంకుల కూటమికి చెల్లించాల్సిన మొత్తం బకాయిలను నిర్ణీత సమయం కంటే ముందే చెల్లించి రుణాలు లేని సంస్థగా మారింది. వడ్డీ భారం గణనీయంగా తగ్గడం వల్ల రాబోయే రోజుల్లో నికర లాభాలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. నాణ్యమైన ఆభరణాల విక్రయాలు పెరగడం వల్ల ఆదాయం వేగంగా పుంజుకుంది. ఖర్చులు 759.42 కోట్లకు పెరిగినప్పటికీ లాభాల రేటు బలంగా ఉండి పెట్టుబడిదారుల్లో నమ్మకం పెంచింది. గత మూడు నెలల్లో ఈ షేరు ధర 96 శాతానికి పైగా పెరిగింది. ఒక నెల వ్యవధిలోనే 42 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. వ్యాపార నిర్వహణలో తీసుకున్న సరైన నిర్ణయాలు ఈ ఆర్థిక పురోగతికి ప్రధాన కారణం.

PC Jeweller Share Price:రాబోయే రోజుల్లో 100 కొత్త షోరూమ్‌లు

కంపెనీ రాబోయే 12 నుండి 18 నెలల కాలంలో 100 కొత్త భారీ షోరూమ్‌లను ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి శ్రేణి, రెండవ శ్రేణి, మూడవ శ్రేణి నగరాల్లో సొంత షోరూమ్‌లు అలాగే ఫ్రాంచైజ్ నమూనాలో విస్తరణ చేపట్టనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కొత్త విక్రయ కేంద్రాల ఏర్పాటు ప్రారంభమవుతుందని యాజమాన్యం ధీమా వ్యక్తం చేసింది. యువతను ఆకట్టుకోవడానికి తేలికపాటి ఆభరణాలు, ల్యాబ్ గ్రోన్ డైమండ్ ఆభరణాల కోసం ప్రత్యేక బ్రాండ్ తీసుకురాబోతోంది. ప్రస్తుతం ఈ సంస్థకు మూడు అనుబంధ కంపెనీలు సేవలు అందిస్తున్నాయి. మెరుగైన ప్రణాళికలు, అప్పులు లేని స్థితి ఈ సంస్థను రటైల్ మార్కెట్లో తిరుగులేని శక్తిగా మారుస్తున్నాయి. రాబోయే పండుగల సీజన్‌లో అమ్మకాలు మరింత పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది.

Epaper: epaper.vaartha.com

నేడు బంగారం, వెండి రేట్లు ఇవే

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha