Dailyhunt
పీవీ సింధు ధరించిన స్టిక్కర్ లాంటి పరికరం విశేషాలివే!

పీవీ సింధు ధరించిన స్టిక్కర్ లాంటి పరికరం విశేషాలివే!

వార్త 1 week ago

PV Sindhu Temple Device: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు ఇటీవల జరిగిన ఉబెర్ కప్ మ్యాచ్‌లో ఒక వినూత్న పరికరంతో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఆమె కంటి పక్కన (కణత భాగంలో) ధరించిన ఒక చిన్న స్టిక్కర్ లాంటి పరికరం కెమెరాల కంటికి చిక్కడంతో, అసలు అది ఏంటి? దాని వల్ల ఉపయోగాలు ఏంటి? అన్న చర్చ మొదలైంది.

Read Also: SRH vs RR: పాట్ కమిన్స్ రాకతో మారనున్న సమీకరణాలు..ఆ ఇద్దరు ఔట్?

PV Sindhu Temple Device: ఏమిటీ 'టెంపుల్' పరికరం?

నిజానికి అది ఒక అత్యాధునిక ‘బయో-సెన్సింగ్’ పరికరం. దీనిని ‘టెంపుల్’ (Temple) అని పిలుస్తారు. క్రీడాకారులు శారీరక సామర్థ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని కూడా అంచనా వేయడానికి ఈ టెక్నాలజీని వాడుతున్నారు.ఇది అథ్లెట్ల మానసిక స్థితిని ఎప్పటికప్పుడు విశ్లేషిస్తుంది.మ్యాచ్ జరుగుతున్నప్పుడు క్రీడాకారిణి ఏకాగ్రత (Concentration Levels) ఎంత ఉంది? ఏ సమయంలో ఆమె ఆలోచనలు మారుతున్నాయి? వంటి అంశాలను ఇది గమనిస్తుంది.మెదడులోని రక్త ప్రసరణను, ఆలోచనల తీవ్రతను ట్రాక్ చేసి డేటా రూపంలో కోచ్‌లకు అందిస్తుంది.

సింధు ధరించిన పరికరాన్ని జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ డెవలప్ చేశారు. దీనికి టెంపుల్ అని పేరు పెట్టారు. ఇది కేవలం ఒక అంగుళం పొడవు ఉంటుంది. ఇందులో బ్లూటూత్ సాంకేతిక ఉండదు. బ్యాటరీ సామర్థ్యంతో ఒకసారి ధరిస్తే 3 నుంచి 4 గంటలపాటు పని చేస్తుంది. ప్రస్తుతం ఇది కేవలం పరీక్ష దశలో ఉంది. మార్కెట్‌లోకి అమ్మకానికి అందుబాటులో లేదు. ఇది భవిష్యత్తులో క్రీడల్లో కొత్త టెక్నాలజీగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha