మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం చోటుచేసుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ (Ajit Pawar) అకాల మరణం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆయన మృతి పట్ల కుటుంబీలకు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా విమాన దుర్ఘటనపై సరైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Kerala: Influencer షింజితా ముస్తఫాకు కోర్టు షాక్
ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా ప్రమాదం..
ముంబయి నుంచి తన సొంత నియోజకవర్గమైన బారామతికి అజిత్ పవార్ ఈరోజు ఉదయమే బయలుదేరారు. అక్కడ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వరుసగా మూడు ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే విమానం బారామతి రన్‌వేపై ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో.. సరిగ్గా 8.45 గంటలకు ఈ ఘోర ప్రమాదం జరిగింది.
విమానం అదుపు తప్పి నేలపై కుప్పకూలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈక్రమంలోనే విమానంలో ఉన్న వారంతా ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు సమాచారం అందిన వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com

