Polavaram : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక సమావే శం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో అత్యంత కీలకమైన పోలవరం బహుళార్థసాధక ప్రాజెక్టు పురోగతిపై వారిద్దరూ వివరంగా చర్చించారు. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాల సమయానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయడమే లక్ష్యంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రికి వివరించారు. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి నిధుల కొరత ఏర్పడకుండా తగిన సాయం అందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.

దీనితో పాటు రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూసేందుకు చేపట్టిన భారీ ప్రాజెక్టుల పురోగతిని కూడా సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం రూ. 30,000 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించిన ‘జల్ జీవన్ మిషన్ – అమరజీవి జలధార’ పథకం పనుల వివరాలను ఆయన తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికీ సురక్షితమైన మంచినీటిని అందించేందుకు చేపడుతున్న ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను విజ్ఞప్తి చేశారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 10 గంటలు

