Polavaram Road Accident: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి లారీని ఢీకొట్టడంతో సంభవించిన ఘోర ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
Car collides with lorry in Polavaram area; two killed.
Polavaram Road Accident: లారీని వెనుక నుంచి ఢీకొట్టిన కారు
ఒడిశా రాష్ట్రం నుంచి ఇనుము లోడుతో తమిళనాడు వైపు వెళ్తున్న లారీని, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన కారు బోడుగూడెం సమీపంలో బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రత కారణంగా రెండు వాహనాల్లోనూ ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు క్షణాల్లోనే పూర్తిగా దగ్ధమైపోగా, అందులో ప్రయాణిస్తున్న వ్యక్తులు బయటకు రాలేక సజీవ దహనమయ్యారు. కారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తలకు తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వస్తున్న వాహనదారులు వారిని గమనించి, డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని కిందకు దింపారు. ఆ పక్క సీట్లో కూర్చున్న మరో వ్యక్తిని కిందకు దింపే క్రమంలో డోరు లాక్ కావడం.. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడం జరిగింది. దీంతో కళ్లెదుటే డ్రైవింగ్ సీటు పక్కన కూర్చున్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. తీవ్ర గాయాలైన వ్యక్తిని అంబులెన్సులో సమీపంలోని ఏడుగురాళ్లపల్లి ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే అతను మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. కారులో ఇద్దరే ఉన్నారని, ఇద్దరూ మృతి చెందడంతో వారి వివరాలు తెలియ రాలేదని పోలీసులు తెలిపారు. మృతులను తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం గ్రామానికి చెందిన నిమ్మకాయల అయ్యన్న (35)గా, తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మియాపూర్‌కు చెందిన అడివి సూర్య వినయ్ తేజ (28)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
ఏఈ నూకరాజు కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ కోసం 10 ప్రత్యేక బృందాల వేట

