Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలవరం ప్రాజెక్టును దర్శించడం నా అదృష్టం.. గవర్నర్ అబ్దుల్ నజీర్

పోలవరం ప్రాజెక్టును దర్శించడం నా అదృష్టం.. గవర్నర్ అబ్దుల్ నజీర్

వార్త 2 months ago

Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ ని పరిశీలించడం తన అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్ పనుల ప్రగతిపై ప్రాజెక్ట్ మీటింగ్ హాలులో జలవనరుల శాఖ మంత్రి డా.

నిమ్మల రామానాయుడు, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, అధికా రులు, జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో గవర్నర్ సమీక్షించారు. ఈ సందర్భంగా, గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ బహుకార్ధసాధక ప్రాజెక్ట్ ఐన పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వరప్రదాయిని అని, ప్రాజెక్ట్ నిర్మాణంతో రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు. నిర్దేశించిన సమయంలోగా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు.

Read Also: AP Weather Alert: రాబోయే 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు

 Governor visits Polavaram project.

Polavaram Project: డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తయింది: మంత్రి నిమ్మల

రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి డా. నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ప్రధానమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఈరోజే పూర్తి అయ్యాయన్నారు. 2027 గోదావరి పుష్కరాలకు ముందుగానే ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పూర్తిచేసి ప్రాజెక్టును జాతికి అంకితం చేసే లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారని, ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా జలవనరుల శాఖ ఇంజనీరింగ్ అధికారులు ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తిచేసే లక్ష్యంతో ఉన్నారన్నారు. ఏటా 3 వేల టిఎంసిలకు పైగా గోదావరి వరదనీరు సముద్రంలోకి వృధాగా పోతుందన్నారు. 322. 73 టిఎంసిల నీటి వినియోగం, 194.6 టిఎంసి ల నీటి నిల్వ సామర్థంతో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టామన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో లక్షలాది ఎకరాలకు సాగునీరు, 540 గ్రామాలలోని 28. 5 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు, 80 టిఎంసి లు నీటి మళ్లించడం, 940 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయడంతోపాటు, 23. 44 టిఎంసి లు పరిశ్రమలకు నీటిని అందించడం జరుగుతుందన్నారు.

అమరావతి చట్టబద్ధత బిల్లుకు రాజ్యసభ ఆమోదం

అమరావతికి పూర్తిగా మద్దతు ఇస్తున్నా. అమరావతి ఏపీకి మధ్యలో ఉంటుంది. అమరావతి పాలనాపరంగా సౌలభ్యంగా ఉంటుంది. అమరావతి అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషిచేస్తున్నారు. పవిత్ర భూమిలో రాజధాని తప్పనిసరిగా వర్ధిల్లుతుంది. అందరికీ ఆమోదయోగ్యమైన రాజధానిని అందరూ సమర్థించాలి అని తెలిపారు. చర్చలో 11 పార్టీల ఎంపీలు మాట్లాడారు. చర్చలో 17 మంది సభ్యులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ మినహా అమరావతికి 10 పార్టీలు మద్దతు తెలిపాయి. ఎలాంటి సవరణలు లేకుండా ఉభయ సభల్లో అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదం పొందింది. సభ్యుల జై అమరావతి, జై భారత్ నినాదాలు సభలో మార్మోగాయి.

రాజ్యసభ నుంచి వైఎస్సార్సీపీ వాకౌట్

అమరావతికి చట్టబద్ధత బిల్లుపై వైఎస్సార్సీపీ రాజ్యసభ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, రాజధాని రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తుందనే దానిపై బిల్లులో స్పష్టత లేదు. రైతులకు ప్లాట్లు ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పాలి. ఏపీకి ప్రత్యేక హోదా విషయంపై బిల్లులో ప్రస్తావన లేదు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వేలకువేల ఎకరాలు తీసుకున్నారు, ఏమాత్రం అభివృద్ధి చేయలేదు. అని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అనంతరం అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ సమయంలోనే వైఎస్సార్సీపీ వాకౌట్ చేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

జిల్లాలో గార్మెంట్ పరిశ్రమలను ఏర్పాటు చేయాలి.. పయ్యావుల కేశవ్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha