DGP CV Anand: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రూపొందించాలని డిజిపి జిల్లాలు, కమిషనరేట్లకు సంబంధించిన సరిహద్దులు, పోలీసు స్టేషన్ల పరిధులపై సమగ్ర ప్రణాళికను ఆనంద్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
దీంతో పాటు రాష్ట్రంలో నేపాల్కు చెందిన పని మనుషులు దొంగలుగా మారుతూ నేరాలకు పాల్పడుతున్న క్రమంలో వారికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలని, దీంతో పాటు పోలీసింగ్లో సాంకేతికను మరింత వాదాలని ఆయన కోరారు. డిజిపి కార్యాల యంలో కీలక అంశాలపై సి.వి ఆనంద్ సోమవారం నాడు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పలు చోట్ల జిల్లాలు, కమిషనరేట్ల సరిహద్దులు, పోలీసు స్టేషన్ల పరిధులపై తరచూ వివాదాలు వస్తుండడం సరికాదని, వీటికి వెంటనే ఫుల్స్టాప్ పెట్టాలని ఆయన కోరారు.
Read also: Telangana Government: మహిళా సంఘాలకు మరో 400 కొత్త బస్సులు
DGP orders comprehensive plan regarding police department boundaries.
DGP CV Anand: జోన్లు, సర్కిళ్ల పునర్విభజనపై సమగ్ర పరిశీలన
ఇటీవల జంట నగరాలు, శివార్లలో కొత్త జోన్లు రావడం, పాత జోన్లలోని కొన్నింటిని మరోదాంట్లో కలవడం వల్ల సమస్యలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని, ఈ క్రమంలో జిల్లాలు, కమిషనరేట్ల సరిహద్దులు, పోలీసు స్టేషన్ల పరిధులపై వెంటనే సమగ్రంగా పరిశీలన చేసి పూర్తిస్థాయిలో ప్రణాళికను రూపొందించాలని ఆయన ఆదేశించారు. ఇందులో సర్కిళ్లు, జోన్లు, గ్రామాల పునర్విభజన వంటి అంశాలు వివరంగా వుండాలని ఆయన ఆదేశించారు. ఈ విషయంలో వక్కా సమాచారం వుండాలని ఆయన కోరారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో నేపాల్కు చెందిన పని మనుషులు పలుచోట్ల ఇళ్లలో పని చేస్తూనే దోపిడీలకు పాల్పడడం, కొన్నిచోట్ల హత్యలకు దిగడం వంటి ఘటనలు కలవరానికి గురిచేస్తు న్నాయని డిజిపి తెలిపారు. ఇందుకుగానూ రాష్ట్ర వ్యాప్తంగా అన్నిచోట్ల నేపాల్ కు చెందిన పనివాళ్లు ఎంత మంది వున్నారు…? వీరంతా ఎక్కడ వున్నారు…? వీరి గత చరిత్ర ఏమిటీ…? నేపాల్లో ఏ ప్రాంతానికి చెందిన వారు…? అనే వివరాలు సమగ్రంగా తయారు చేయాలని డిజిపి ఆదేశించారు.
ఏఐ, డ్రోన్లు, స్మార్ట్ అప్లికేషన్లతో స్మార్ట్ పోలీసింగ్
పోలీసింగ్లో సాంకేతికను మరింత వాడాలి..రాష్ట్రవ్యాప్తంగా పోలీసింగ్లో సాంకేతికను మరిం తగా వాదాలని డిజిపి ఆదేశించారు. టెక్నాలజీ ఆధారిత పోలీసింగ్ ద్వారా కోర్ అప్లికే షన్లు, సిసిటిఎన్ఎస్ 2.0 అమలు, టిజి కాప్స్ వ్యవస్థ వినియోగంపై డిజిపి ఉన్నతాధికారులతో చర్చించి కీలక ఆదేశాలు జారీ చేశారు. డయల్ 100 రౌడీ షీటర్లపై నిఘా. చోరీ వాహనాల ఆచూకీ కనుగొనడం, హిస్టరీ షీటర్ల డేటా వంటి అంశాలను టెక్నాలజి వాడడం ద్వారా వేగంగా వేబ ట్టవచ్చని డిజిపి తెలిపారు. దీంతో పాటు ఏఐ ఆధారిత పోలీసింగ్, డ్రోన్ల వాడకం, హెచ్ఎర్ఎంఎస్ డేటా ఇంటెలిజెన్స్, స్మార్ట్ అప్లికేషన్ల విని యోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని డిజిపి సూచించారు. “తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్ యూజింగ్… యూజింగ్ టెక్నాలజొ అనే లక్ష్యంతో పోలీసులు ముందుకు సాగాలని ఆయన తెలిపారు. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్, వెహికల్ ఆడిట్, సిబ్బంది వినియోగం, ట్రాఫిక్ మేనేజ్ మెంట్ వంటి అంశాలపైనా ఎలా వ్యవహరించాలనే దానిపై డిజిపి సూచనలు చేశారు. భవిష్యత్తులో ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ ట్రాన్స్ పోర్టు బ్యూరోతో పాటు ఆహార కల్తీ నిరోధకానికి ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సిన అవసరం వుందని డిజిపి పేర్కొన్నారు.
సమావేశానికి హాజరైన ప్రముఖ పోలీసు ఉన్నతాధికారులు
ఈ సమావేశంలో హోం శాఖ ముఖ్య కార్యదర్శి శిఖా గోయల్, పోలీసు అకాడమి డైరక్టర్ అభిలాష్ బిస్త్, నిఘా విభాగం చీఫ్ విజయ్ కుమార్, టెక్నికల్ సర్వీస్ డిజి శ్రీనివాసరావు, హోంగార్డుల విభాగం డిజి స్వాతి లక్రా, సిటీ కొత్వాల్ సజ్జన్నార్, గ్రే హౌండ్స్ డిజి అనిల్ కుమార్, మల్టీ జోన్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి, ఫ్యూచర్ సిటీ కొత్వాల్ డాక్టర్ తరుణ్ జోషి, పీ అండ్ ఎల్ ఐజి డాక్టర్ గజారావు భూపాల్, సైబరాబాద్, మల్కాజిగిరి కమి షనర్లు రమేష్, సుమతి తదితరులు పాల్గొన్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read also Epaper: epaper.vaartha.com
Read also:

