Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పోలీసుల విచారణకు హాజరైన తమ్మినేని సీతారాం

పోలీసుల విచారణకు హాజరైన తమ్మినేని సీతారాం

వార్త 1 week ago

Tammineni Sitaram: శ్రీకాకుళం నగరం పరిధిలోని చాపురంలో సుమారు రూ. 4 కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాలతో ఆక్రమించారనే తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు.

భూ యజమాని బతికుండగానే ఆయన చనిపోయినట్లు నకిలీ మరణ, వారసత్వ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, తమ్మినేని కుమారుడి పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో తమ్మినేని సీతారాంతో పాటు ఆయన సతీమణి వాణి, కుమారుడు చిరంజీవి నాగ్, అప్పటి సబ్ రిజిస్ట్రార్ సహా మొత్తం 13 మందిపై FIR నమోదైంది. కేసు నమోదుకాగానే అరెస్ట్ భయంతో కొన్నిరోజులుగా ఆయన కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టిన సంగతి తెలిసిందే.

విచారణలో నిజా నిజాలు: పోలీసులను ఆశ్రయించిన మాజీ స్పీకర్

బుధవారం ఉదయం శ్రీకాకుళం రూరల్ స్టేషన్‌కు చేరుకున్న తమ్మినేని సీతారాంను అక్రమ రిజిస్ట్రేషన్, ఫోర్జరీ పత్రాల వ్యవహారంలో పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలపై తమ్మినేని వర్గం స్పందిస్తూ… తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని, మధ్యవర్తులు మరియు డాక్యుమెంట్ రైటర్లను నమ్మి సాధారణ పౌరుల తరహాలోనే భూమిని కొనుగోలు చేసి మోసపోయామని, ఈ వ్యవహారంలో తాము కూడా బాధితులమేనని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో ప్రమేయం ఉన్న పలువురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, మాజీ స్పీకర్‌ను విచారించడం ద్వారా ల్యాండ్ గ్రాబింగ్ ముఠా పాత్ర మరియు నకిలీ రికార్డుల సృష్టి వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటకు తీసేందుకు దర్యాప్తు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు.

గోదావరిలో పడిపోయిన నీటి ప్రవాహం: ఎల్​నీనో ప్రభావంతో ఎడారిని తలపిస్తున్న జీవనది

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha