Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పొలిటికల్ రీఎంట్రీపై త్వరలో ప్రకటన- విజయసాయి

పొలిటికల్ రీఎంట్రీపై త్వరలో ప్రకటన- విజయసాయి

వార్త 2 weeks ago

Vijay Sai Reddy : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తన రాజకీయ పునరాగమనంపై క్లారిటీ ఇస్తూ చేసిన ట్వీట్ ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ప్రత్యక్ష రాజకీయాల నుంచి కొద్దికాలం విరామం తీసుకున్న ఆయన, భవిష్యత్తు కార్యాచరణ మరియు ప్రణాళికను త్వరలోనే విలేకరుల సమావేశం (ప్రెస్ మీట్) నిర్వహించి అధికారికంగా వెల్లడిస్తానని ప్రకటించారు. తనది మొదటి నుంచీ స్వతంత్ర భావజాలమని, ఎవరి ఒత్తిళ్లకు, ప్రలోభాలకు లేదా బాహ్య ప్రభావాలకు లోనయ్యే ప్రసక్తి లేదని ఆయన తేల్చిచెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా, ఆత్మగౌరవంతో కూడిన నిర్ణయాన్ని నిర్భయంగా తీసుకోబోతున్నట్లు స్పష్టం చేయడంతో ఆయన తదుపరి అడుగుపై ఉత్కంఠ నెలకొంది.

వైసీపీలో పునరాగమనమా? కొత్త దారి వెతుక్కుంటారా?

వైసీపీకి వ్యవస్థాపక నాయకుల్లో ఒకరిగా ఉండి, గతంలో పార్టీలో కీలక పాత్ర పోషించిన విజయసాయి రెడ్డి తిరిగి అదే పార్టీ గూటికి చేరుతారని ఒక వర్గం గట్టిగా ప్రచారం చేస్తోంది. అయితే, రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న తరుణంలో ఆయన మళ్లీ వైసీపీ కండువా కప్పుకుంటారా లేదా స్వతంత్రంగా లేదా కొత్త ప్రత్యామ్నాయ పంథాలో ముందుకెళ్తారా అనేది సస్పెన్స్‌గా మారింది. ‘స్వతంత్ర భావజాలం’ అనే పదాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడంతో కొత్త పొలిటికల్ ప్లాట్‌ఫారమ్ లేదా భిన్నమైన రాజకీయ వ్యూహంతో ముందుకు రావచ్చనే వార్తలు కూడా ఊపందుకున్నాయి. ఏది ఏమైనా, విజయసాయి రెడ్డి పెట్టబోయే ప్రెస్ మీట్ ఏపీ రాజకీయంలో ఎలాంటి కొత్త మలుపులకు దారితీస్తుందో చూడాలి.

మళ్లీ మీసం మెలేస్తున్న బ్లాక్ టైగర్ రొయ్యల సాగు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha