Pawan Kalyan :ఇదేనా మన సభ్యత, సంస్కారం, సాంప్రదాయం? ఇదేనా మనకు మన విద్య ద్వారా లభించినవినయం, వివేకం, వికాసం? ఈ మధ్య హైదరాబాదులో చెలరేగుతున్న మాటల మాయాజాలం నన్నెంతో కలవరపరి చింది.
ఇంకా కలవర పరుస్తూనే ఉంది. దేశ స్వాతంత్య్ర సమరంలో, హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి ఆనాటి హైదరా బాదు వారు జరిపిన విలీన పోరాటం లో, అటు తదుపరి తెలంగాణ అస్తిత్వ పోరాటంలో చాలా చురుకుగా పనిచేసి కరవళ్లు మోసిన వాణ్ణి, కారాగారాల్లో బంధించబడినవాణ్ణి. నిజమైన, స్వచ్ఛమైన స్వాతంత్ర్య సమరయోధుణ్ణి. కనుకనే ఈనాటి అసభ్యకరమైన, ఆందో ళనకరమైన మాటల పోటీలను చూస్తుంటే, వింటుంటే తట్టుకోజాలడం లేదు. ఇదేనా మనం మన యువతకిస్తున్న సందేశం, వారసత్వం? ఇందుకొరకేనా మనం సకల త్యాగాలతో స్వాతంత్ర్యాన్ని సాధించింది? అని అనుకుంటూ శాంతి ప్రశాంతతలు కోల్పోతున్నాను. ఒక దేశం లేక రాష్ట్రంవారు ఇంకొక దేశానికి, రాష్ట్రానికి అనేకానేక కారణాల వల్ల రావటం పోవటం జరగడం అనాదిగా మామూలే కదా!
అది వ్యాపారం కొరకు కావచ్చు, విద్య కొరకు కావచ్చు. ఉపాధి కొరకు కావచ్చు, కాని నాకు తెలిసినంతవరకు అది రాజకీయాల కొరకు మాత్రం కాదు, కాకూడదు కూడా. కాని ఇప్పుడు మాత్రం తక్కినవాటికంటే రాజకీయ కారణాలే ఎక్కువేమోనని తెలంగాణావారు గాభరా పడుతున్నారు. అందుకేనేమో కొందరు అలజడులకు, అసభ్య పదజ లాలకు పాటుపడుతున్నారు. ఇది వారి విశ్వాసానికి చెందిన విషయం. దానికి గత చరిత్ర కారణం కదా! కాదనగలమా మరి!
Pawan Kalyan
Pawan Kalyan : అభ్యంతరమెందుకు?
ఒకప్పుడు తెలంగాణాను ఆంధ్రా ప్రాంతంలో విలీనం చేస్తున్నప్పుడు ‘జంటిల్మెన్ అగ్రిమెంట్ ద్వారా తెలంగాణా వారికి ఆంధ్రాప్రాంతపు నేతలు ఎన్నో వాగ్దానాలు చేశారు. వాటిని పట్టించుకోకపోవడం వలననే కదా ప్రత్యేక తెలం గాణా పోరాటం వచ్చింది. మరి ఇప్పుడుకూడా ఈనాటి ప్రభుత్వాలు అనేకానేక వాగ్దానాలు చేస్తూనే ఉన్నాయి. వాటిని అమలు చేయకుండా చేతులెత్తేస్తూనే ఉన్నాయి. వాటికి అనేకానేక కారణాలు ఉదహరిస్తూ. మరొకసారి తెలుగువారందరూ కలిస్తే రెండు రాష్ట్రాలు ఒకటైతే తెలం గాణా వారికి అదే గతి పడుతుందేమోననే అనుమానం రాకుండా ఉంటుందా? ఇంగ్లీషులో ఒక సామెత ‘వి హాడ్ ద ఎక్స్ పీరియన్స్ బట్ మిక్స్డ్ ద మీనింగ్’ యనునది ఉంది. ఇంకొకటి ‘హిస్టరీ టీచస్ అజ్ దట్ మ్యాన్ కైండ్హా ర్డలీ లర్న్స్ ఎనీథింగ్ ఫ్రమ్ హిస్టరీ’ యనునది. ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న కలహాలను చూస్తుంటే ఔను కదా! అంతే కదా! అని అనిపిస్తుంది. మనకు మొదటి ప్రపంచ యుద్ధం వచ్చింది. దానితో మనమేం నేర్చుకున్నాం. రెండవ ప్రపంచయుద్ధం వచ్చింది. మనమేం నేర్చుకున్నాం. ఇప్పుడు మూడో ప్రపంచయుద్ధం దాదాపు మొదలైంది. దానివలన మనమేం నేర్చుకుంటున్నాం? తెలంగాణ అస్తిత్వ పోరాటం వచ్చింది, దానితో మనం ఏం నేర్చుకున్నాం? ఇదీ అంతే కావచ్చునను భయాందోళన ఈనాటి తెలంగాణా వారి అలజడికి, అప్రస్తుత, అసభ్య పదజాల వాడుకకు కారణం కాదని నిస్సందేహంగా అనగలమా? పవన్ కళ్యాణ్ జనసేన యను ఒక పార్టీని స్థాపించారు. ఆ పార్టీని తెలంగాణాలో కూడా పెట్టదలచుకున్నారు. దానికి అభ్యంతరమెందుకు? ఆయన హైదరాబాదులో ఒక సభ జరపాలని అనుకున్నారు. దానికి అనుమతి నిరాకరణ ఎందుకు? ఆ పార్టీ కాక ఇంకా ఎన్నో పార్టీలు హైదరాబాదులో లేవా? ఇంకా వస్తూనే ఉన్నాయి కదా? ఆయా పార్టీలు వారివారి సభలు సమావే శాలు జరుపుకోవడం లేదా? అసలు కారణం అది కాదు. అసలు కారణం ఆనాటి అంధ్రాప్రాంతపు అధిపత్యం తిరిగి మరొకసారి తెలంగాణాకి వస్తుందేమోనని, ఇది తెలంగాణా వారి విశ్వాసానికి చెందింది.
సన్నాహాలు ప్రారంభించకపోతే బాగుండేదేమో?
ఎవరెన్ని అన్నా ఆ విశ్వాసం ఇంత త్వరగా పోదు, పోజాలదు. ఇది పవన్ కళ్యాణ్ అర్థం చేసుకొని ఇంత తొందరగా ఇచట వారి పార్టీకి చెందిన సన్నాహాలు ప్రారంభించకపోతే బాగుండేదేమో? కాస్త రాజకీయ వాతావరణం చల్లబడ్డాక మరికొంతకాలం ఓపిక పట్టి, ఈలోపల అచటి ఇచటి మేధావులతో సంప్రదించి కొన్ని సమిష్టి సభలు, సదస్సులు నిర్వహించి అనుకూల మైన వాతావరణాన్ని సృష్టించి ఇప్పుడు చేయదలచుకున్న వన్నీ అప్పుడు చేస్తే బాగుండేదేమో? కాస్త తొందరపాటు జరిగిందని అనిపిస్తోంది. ఒకనాటి హైదరాబాదు రాష్ట్రంలో ‘ముల్కీ రూల్స్’ యనునవి ఉండేవి. వాటిద్వారా హైదరా బాదు రాష్ట్రంలోని విద్యావసతులు, ఉద్యోగాలు, భూమి పుట్రలు మున్నగునవి మొదట హైదరాబాదు వారికే చెందాలి అనే నిబంధన ఉండేది. వాటిని తూ.చ తప్పక అమలు చేసినన్ని రోజులు ఏ గొడవలూ రాలేదు. ఎపుడైతే వాటిని అమలు చేయలేదో, అమలు చేయుటకు ఎన్నో అవ రోధాలు కల్పించి, వాటిని ఇతర ప్రాంతాల వారు కాజేయు టకు వీలు కల్పించారో అప్పుడు వచ్చింది ప్రత్యేక తెలంగాణ పోరాటం, దీని గురించి’గిర్గలాని కమీషన్’ సవివరంగా పేర్కొంది. అప్పటికీ ఇప్పటికీ అసలు గొడవంతా విద్యావస రాల కొరకు, ఉద్యోగాల కొరకు, భూములు, నీళ్లు వగైరాల కొరకే కదా? అలాంటప్పుడు ఆనాటి ‘ముల్కీ రూల్స్’ లాంటివి ఈనాడు కూడా తెలంగాణా వారికొరకు పెట్టుకో వచ్చు కదా! అలాంటి ముల్కీరూల్స్ లాంటివి కాశ్మీర్లో కూడా అమలులో ఉన్నాయి కదా. అప్పుడు ఈ గొడవంతా ఉండదు కదా!
Pawan Kalyan
ముల్కీ రూల్స్
సోనియాగాంధీకి ఒకప్పుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండింది. ఆమెను అలా కానివ్వకుండా సుబహ్మణ్యస్వామి రాష్ట్రపతి దగ్గరకు వెళ్ళి ఈమె ఇటాలి యన్ దేశ పౌరసత్వం కలది, ఆ దేశ రాజ్యాంగంలో ఆ దేశపౌరులు కానివారు ఆ దేశానికి రావచ్చు. ఏ కార్యకలాపాలనైనా చేసుకోవచ్చు. కాని అత్యంత ప్రముఖమైన ప్రధానమంత్రిత్వాన్ని మాత్రం ఆ దేశ పౌరుడికే ఉంటుంది’ యని రాసి ఉంది. అలాగే ఇక్కడ కూడా ఇక్కడి ప్రధాన మంత్రిత్వం ఇక్కడి వారికే దక్కాలి కాని మరొకరికి కాదు యని వాదించి ఆమెను ప్రధానమంత్రి కాకుండా చేశారు. అలాంటి నిబంధనను మనం కూడా ‘ముల్కీ రూల్స్’ పెట్టుకోవడానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. తెలంగాణావారి హక్కులను ఇతరులపాలు కాకుండా చేయడానికి. ఎవరైనా ఎక్కడివారైనా ఇక్కడికి రావచ్చు. ఏమైనా చేసుకోవచ్చు కాని ఇచటి రాజకీయ పరమైన ఉన్నత పదవులు అంటే, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రిలాంటివి ఇక్కడి వారికే, లేక ఇక్కడ చిరకాలంగా నివసిస్తున్నా వారికే దక్కాలి అనే నిబంధనను చేసుకోవచ్చు. అప్పుడు తెలంగాణలోని విద్యావకాశాలు, ఉద్యోగావకాశాలు, భూమి వనరులు మున్నగువాటికిచెందిన యాజమాన్యతలు పూర్వం నుండి ఇచటే పుట్టి పెరిగిన వారికి లేక చాన్నాళ్ల నుండి ఇచ్చట స్థిరపడ్డవారికి మాత్రమే లభించేటట్లు చేయవచ్చు. ఆర్థిక స్థోమతే కదా అన్ని స్థోమ తల కంటే మిన్న. అలాంటి ఆర్థిక స్థోమత తగ్గుతుందేమో నని తెలంగాణా ప్రాంతం వారికున్న భయాందోళనలు, సందేహాలు సహజమే కదా! ఇప్పుడు గొడవంతా వస్తున్నది ఆ భయాందోళనల, సందేహాల వలననే కదా? తెలంగాణా వారి భయాందోళనలను, సందేహాలను నివారించాలంటే పవన్ కళ్యాణ్ వీటిని పట్టించుకోవలసుంటుంది. సిద్ధమేనా మరి! పవన్ కళ్యాణ్ కాస్తాగి వీటిగురించిసావధానంగా ఆలోచించి ముందడుగు వేయగలరా మరి?
-డాక్టర్ కొండలరావు వెల్చాల
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also:
కేజీహెచ్ వద్ద హై టెన్షన్.. మంత్రి లోకేష్‌ను ముట్టడించిన స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు!

