Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పొరుగింటి యువకుడితో వివాహేతర సంబంధం.. చివరకు రైలు కింద ఇద్దరి మృతి!

పొరుగింటి యువకుడితో వివాహేతర సంబంధం.. చివరకు రైలు కింద ఇద్దరి మృతి!

వార్త 2 weeks ago

Mandya Double Death Case: కర్ణాటకలోని మండ్య జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహిత మహిళ, ఆమెకు పరిచయమున్న యువకుడు రైలు కింద పడి మృతిచెందారు.

మండ్య నగర శివారులోని ఇందువాల ప్రాంతం వీసీ ఫామ్ రైల్వే గేట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళ.. ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ మరో యువకుడితో పరిచయం పెంచుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కుటుంబంలో తలెత్తిన విభేదాలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరుకు చెందిన సహనా (25) ఎనిమిదేళ్ల క్రితం ఆటో డ్రైవర్ వీరేశ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఆరేళ్ల కుమార్తె, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ కుటుంబం బెంగళూరులోని మదనాయకనహళ్లిలో నివసిస్తోంది. వివాహం తర్వాత కొంతకాలం వారి కాపురం సజావుగానే సాగినట్లు తెలుస్తోంది. అయితే అదే ప్రాంతంలో పొరుగింట్లో నివసించే రాహుల్‌తో సహనాకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం క్రమంగా సన్నిహిత సంబంధంగా మారినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

10-Month-Old Girl Electrocuted : జగిత్యాల జిల్లాలో విషాదం..విద్యుదాఘాతానికి గురై 10 నెలల చిన్నారి మృతి

 Mandya Double Death Case

Mandya Double Death Case: భార్యపై అనుమానంతో భర్తతో గొడవలు

సహనా, రాహుల్ మధ్య సన్నిహిత సంబంధం గురించి వీరేశ్‌కు తెలియడంతో భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఈ విషయంపై ఇద్దరి మధ్య పలుమార్లు గొడవలు జరిగినట్లు సమాచారం. కుటుంబంలో సమస్యలు పెరగడంతో ఇరువైపుల కుటుంబ పెద్దలు జోక్యం చేసుకున్నారు. దంపతుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ వారి మధ్య విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. దీంతో కుటుంబంలో తరచూ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై సోమవారం మరోసారి సహనా, వీరేశ్ మధ్య వాగ్వాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ గొడవ తర్వాత సహనా మంగళవారం ఇంటి నుంచి వెళ్లిపోయింది. మండ్య జిల్లాలోని గున్నాయకనహళ్లిలో నివసిస్తున్న తన అమ్మమ్మ ఇంటికి చేరుకుంది. సహనా అక్కడికి వెళ్లిన విషయం తెలుసుకున్న రాహుల్ గురువారం ఆమె వద్దకు వెళ్లాడు. అనంతరం ఇద్దరూ కలిసి వీరేశ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే మండ్య నగర శివారులోని ఇందువాల ప్రాంతం వీసీ ఫామ్ రైల్వే గేట్ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న రైలు నుంచి కిందపడి సహనా, రాహుల్ మృతిచెందారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను పరిశీలించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మండ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్) ఆస్పత్రికి తరలించారు.

వైద్యుడి ఫోన్‌లో మహిళకు సంబంధించిన వీడియోలు లభ్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha