Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Power companies: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ సమర్ధనీయమా?

Power companies: విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ సమర్ధనీయమా?

వార్త 4 months ago

భారతదేశ ఇంధన రంగంలో విద్యుత్ పంపిణీ సంస్థల ప్రైవేటీకరణ అంశం ప్రస్తుతం ఒక కీలక చర్చనీయాం శంగా మారింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ డిస్కంలు తీవ్రమైన ఆర్థిక నష్టాల్లో ఉండటం, పెరుగుతున్న బకా యిలు, సాంకేతిక లోపాల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోంది.

ప్రస్తుతందేశంలోని డిస్కంల మొత్తం అప్పులు దాదాపు 6లక్షల కోట్ల రూపాయ లకు పైగా ఉండటం ఈ సంస్కరణల ఆవశ్యకతను తెలియ జేస్తోంది. ప్రభుత్వరంగ సంస్థల ఆర్థిక స్థితిగతులు నానాటికీ దిగజారుతుండటంతో వ్యవస్థలో సమూల మార్పులుతీసుకు రావాలని పాలకులు నిర్ణయించారు. డిస్కంల ప్రైవేటీకరణకు సంబంధించిన ఇటీవలి ప్రతిపాదనను 16వ ఆర్థిక సంఘం ముందుకు తెచ్చింది. పార్లమెంటులో సమర్పించిన తన నివే దికలో, దీర్ఘకాలిక ఆర్థిక నష్టాలను అధిగమించడానికి నిర్వ హణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి విద్యుత్ పంపిణీ సంస్థల (Power companies) ప్రైవేటీకరణను ప్రోత్సహించాలని కమిషన్ సిఫార్సు చేసింది. డిస్కంలను ప్రైవేట్ పెట్టుబడిదారులకు మరింతఆకర్షణీయంగా మార్చడానికి ప్రత్యేక యంత్రాంగాలను రూపొందించాలని, ఆర్థిక పునర్నిర్మాణ మద్దతు ద్వారా ప్రైవేటీ కరణను ప్రోత్సహించాలని సూచించింది. నీతి ఆయోగ్కూడా విద్యుత్ రంగంలో సామర్థ్యాన్ని పెంచడానికి ప్రైవేట్ భాగస్వామ్యం అవసరమని బలంగా సిఫార్సు చేయగా, విద్యుత్ చట్ట సవరణ బిల్లు ద్వారా ఈ సంస్కరణలను అమలు చేయాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. డిస్కంల ప్రైవేటీకరణ వల్ల అనేక అవకాశాలు ఉన్నాయి.

ప్రధానంగా ప్రైవేట్ సంస్థల ప్రవేశంతో ఈ రంగంలోకి అత్యాధునిక సాంకేతికత, భారీ పెట్టుబడులు వస్తాయి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, విద్యుత్ చౌర్యం నివారణ, పంపిణీ వ్యవస్థల ఆధునికీకరణ వేగవంతం అవుతుంది. ఉదాహరణకు ఢిల్లీలో విద్యుత్ పంపిణీని (Power companies) ప్రైవేటీకరించిన తర్వాత 'అగ్రిగేట్ టెక్ని కల్ అండ్ కమర్షియల్ నష్టాలు 50 శాతం నుండి కేవలం 8శాతానికి తగ్గాయి. ప్రైవేట్ యాజమాన్యంలో జవాబు దారీతనం పెరగడం వల్ల నిర్వహణ సామర్థ్యం మెరుగుపడుతుంది. విద్యుత్ కోతలు తగ్గడం, నాణ్యమైన విద్యుత్ సర ఫరా జరగడం వల్ల పారిశ్రామిక, వాణిజ్య రంగాలు మరింత వృద్ధి చెందుతాయి. పోటీ పెరగడంవల్ల వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయి. ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారం తగ్గి, ఆ నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించే అవకాశం ఉంటుంది. అయితే ఈప్రక్రియలో అనేక సవాళ్లు కూడా దాగిఉన్నాయి. గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేయడం ప్రైవేట్ సంస్థలకు భారంగా అనిపిస్తే, ఆప్రాంతాల అభివృద్ధి కుంటు పడే ప్రమాదం ఉంది. ప్రస్తు తం ప్రభుత్వం రైతులకు, పేద వర్గాలకు ఇస్తున్న విద్యుత్ సబ్సిడీల భవిష్యత్తు పై ఆందోళన వ్యక్తమవుతోంది. ఒడిశాలో మొదట చేపట్టిన ప్రైవేటీకరణ ప్రయోగం ఆశించిన ఫలితాల ను ఇవ్వకపోవడం, ప్రైవేట్ సం స్థలుమధ్యలోనే తప్పుకోవ డం వంటి ఉదాహరణలు భయాం దోళనలకు కారణమవు తున్నాయి. ప్రైవేటీకరణ వల్ల ప్రభుత్వ ఉద్యోగుల భద్రత దెబ్బతింటుందనే వాదనతో కార్మిక సంఘాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ అంశంపై కేంద్రం నిర్ణయాలు తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని కేరళ, తెలంగాణ వంటి రాష్ట్రాలు వాదిస్తున్నాయి.
-సి.హెచ్. ప్రతాప్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha