Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రాణాలు తీస్తున్న 'సెకండ్ స్మోకింగ్'

ప్రాణాలు తీస్తున్న 'సెకండ్ స్మోకింగ్'

వార్త 3 weeks ago

Second-Hand Smoking : ధూమపానం చేసే వ్యక్తులకే కాకుండా, వారి పక్కన ఉంటూ ఆ సిగరెట్ పొగను పీల్చే నిరపరాధులకు కూడా తీవ్రమైన ప్రాణాపాయం పొంచి ఉందనే విషయం వైద్య వర్గాల తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.

దీనినే సాంకేతికంగా ‘సెకండ్ హ్యాండ్ స్మోకింగ్’ (Second-Hand Smoking) లేదా ప్యాసివ్ స్మోకింగ్ అని పిలుస్తారు. తాజా నివేదికల ప్రకారం, 2023 సంవత్సరంలో భారతదేశంలో దాదాపు 3.2 లక్షల మంది కేవలం ఈ పరరోక్ష ధూమపానం వల్లే ప్రాణాలు కోల్పోగా, సుమారు 44.4 కోట్ల మంది దీని తీవ్ర ప్రభావానికి గురయ్యారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏటా 17 లక్షల మందికి పైగా ఈ ప్యాసివ్ స్మోకింగ్ కారణంగా మరణిస్తున్నారు. సిగరెట్ పొగలో ఉండే ప్రమాదకరమైన కార్సినోజెన్లు మరియు విషపూరిత రసాయనాలు పీల్చడం వల్ల గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ మరియు శ్వాసకోశ సంబంధిత తీవ్ర వ్యాధులు సంభవిస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

పబ్లిక్ ప్లేసుల్లో నిషేధం తక్షణ అవసరం: ఆరోగ్య నిపుణుల హెచ్చరిక

పరోక్ష ధూమపానం వల్ల ముఖ్యంగా గర్భిణులు, చిన్న పిల్లలు మరియు వృద్ధులు తీవ్రమైన ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఇళ్లలో, పని ప్రదేశాల్లో మరియు బహిరంగ ప్రదేశాల్లో ఇతరులు వదిలే పొగను పీల్చడం వల్ల రక్తం గడ్డకట్టడం, పక్షవాతం (Stroke) మరియు ఊపిరితిత్తుల పనితీరు మందగించడం వంటి తీవ్రమైన దుష్పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రాణాంతక ముప్పు నుంచి ప్రజారోగ్యాన్ని కాపాడుకోవడానికి పబ్లిక్ ప్లేసుల్లో (బహిరంగ ప్రదేశాలు) ధూమపానాన్ని పూర్తిగా నిషేధించాలని, చట్టాలను మరింత కఠినంగా అమలు చేయాలని ఆరోగ్య నిపుణులు ప్రభుత్వాలను కోరుతున్నారు. ప్రజల్లో కూడా ఈ పరరోక్ష ధూమపానం వల్ల కలిగే నష్టాలపై విస్తృత స్థాయిలో అవగాహన పెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడుతున్నారా?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha