Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రాణం తీసిన ఈత సరదా

ప్రాణం తీసిన ఈత సరదా

వార్త 3 weeks ago

Tripuranthakam tragedy: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఒక ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు రోజు కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లిన 15 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు.

ఈ విచారకరమైన ఘటన గొల్లపల్లి గ్రామంలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గొల్లపల్లి గ్రామానికి చెందిన పిచ్చయ్య కుమారుడు ఉప్పలపాటి తిరుమలబాబు (15) ఆదివారం తోటివారితో కలిసి గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్లాడు. స్నేహితులతో కలిసి చెరువులో దిగి ఈత కొడుతున్న సమయంలో, ప్రమాదవశాత్తు నీటి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి వెళ్లడంతో తిరుమలబాబు నీటిలో మునిగిపోయాడు.

Read Also: Anna Konidela: పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై భార్య అన్నా భావోద్వేగ పోస్ట్

 15-year-old boy dies while swimming in a tank!

Tripuranthakam tragedy: గాలింపు చేపట్టిన గ్రామస్థులు.. పోలీసుల దర్యాప్తు

బాలుడు నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన తోటివారు గట్టిగా కేకలు వేయడంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే సంఘటనా స్థలానికి పరుగున వచ్చారు. స్థానిక ఈతగాళ్లు చెరువులోకి దిగి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటి శ్రమ అనంతరం తిరుమలబాబును నీటి నుంచి బయటకు తీసినప్పటికీ, అప్పటికే అతను శ్వాస ఆడక మృతి చెందినట్లు గుర్తించారు. కళ్ల ముందే ఎదుగుతున్న కొడుకు కాటికి వెళ్లడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు గ్రామంలోని వారిని సైతం కలచివేసాయి. ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న త్రిపురాంతకం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Epaper: epaper.vaartha.com

కోడలి ప్రాణాన్ని బలిగొన్న ఆమ్లెట్ వివాదం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha