Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డేట్ ఫిక్స్?

ప్రభాస్ 'స్పిరిట్' రిలీజ్ డేట్ ఫిక్స్?

వార్త 2 weeks ago

Spirit movie release date: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో రాబోతున్న 'స్పిరిట్' చిత్రంపై అంచనాలు ఏ రేంజ్‌లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తాజాగా ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Read Also: Tamil Nadu Elections 2026: నా ఫేవరెట్ హీరో విజయ్ కాదు.. ఆ స్టార్ హీరో పేరు చెప్పి షాకిచ్చిన త్రిష!

సందీప్ రెడ్డి వంగ 'సెంటిమెంట్' డేట్?

ప్రస్తుతం ప్రభాస్ తన ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో 'స్పిరిట్' షూటింగ్ కాస్త ఆలస్యమవుతూ వస్తోంది. వాస్తవానికి ఈ సినిమాను 2027 మార్చిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ తొలుత భావించింది. అయితే, దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఇప్పుడు తన ప్లాన్ మార్చినట్లు తెలుస్తోంది. గతంలో ఆయన దర్శకత్వం వహించిన 'యానిమల్' సినిమా డిసెంబర్ 1న విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ, 'స్పిరిట్'ను కూడా 2027 డిసెంబర్ 1న రిలీజ్ చేయాలని ఆయన గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం.

పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ విశ్వరూపం

ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో హీరోల క్యారెక్టరైజేషన్ చాలా డార్క్ గా, ఇంటెన్స్‌గా ఉంటుంది. మరి ప్రభాస్‌ను ఆయన ఏ రేంజ్‌లో చూపిస్తారో అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా, త్వరలోనే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

కల్కి-2లో సాయి పల్లవి?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha