Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రభుత్వ ధనంతో 'ఉచిత' పథకాలా?

ప్రభుత్వ ధనంతో 'ఉచిత' పథకాలా?

వార్త 1 month ago

Telangana High Court: ఉచిత పథకాలు, ప్రజాధనం వినియోగంపై తెలంగాణ హైకోర్టులో బుధవారం కీలక చర్చ జరిగింది. చర్చ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

చట్టబద్ధత లేని పథకాలకు ప్రజాధనం వృథా చేస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ ధనాన్ని కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి ఉచిత పథకాలకు ఖర్చు చేస్తే ఎలా అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ప్రభుత్వం అఫిడవిట్ - ధర్మాసనం అభిప్రాయం

బుధవారం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. బడ్జెట్లో కేటాయింపుల ప్రకారం పథకాలకు డబ్బులు ఇస్తున్నట్లు తెలిపింది. పేద యువతుల వివాహం కోసమే ఈ నిధులు కేటాయిస్తున్నట్లు వివరించింది. అయితే ప్రభుత్వ ధనాన్ని ఉచిత పథకాలకు ఖర్చు చేస్తే ఎలా అని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ రంగ సంస్థలను లాభాల్లోకి తెచ్చి.. ఆ డబ్బును ఉచిత పథకాలకు ఖర్చు చేయొచ్చు కదా అని ధర్మాసనం అభిప్రాయపడింది.

భూ బాధితుల సమస్యలు - విచారణ వాయిదా

భూసేకరణలో న్యాయం జరగక బాధితులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని హైకోర్టు పేర్కొంది. భూ బాధితుల సమస్యలపై ప్రభుత్వం ఏం చేస్తుందో గురువారం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణను మరుసటి రోజుకు వాయిదా వేసింది.

Telangana High Court: స్టే ఎత్తివేయాలని ప్రభుత్వ విజ్ఞప్తి

కాగా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై ఉన్న స్టేను ఎత్తివేయాలని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ రెండు పథకాల లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కోరారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌పై ఉన్న స్టేను ఎత్తి వేయటంపై హైకోర్టు గురువారం నిర్ణయం తీసుకోనుంది.

Epaper: epaper.vaartha.com

ఇంజినీరింగ్ ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు ప్రారంభం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha