Govt Jobs Discipline: ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో అభ్యర్థులు కచ్చితమైన క్రమశిక్షణ పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముఖ్యంగా పోలీస్ వంటి విభాగాల్లో శారీరక సామర్థ్య పరీక్షలకు నిర్ణీత సమయంలోనే హాజరుకావాలని సూచించింది.
అనారోగ్యం లేదా వ్యక్తిగత కారణాలను చూపుతూ పరీక్షలను వాయిదా వేయాలని కోరడం చట్టరీత్యా సాధ్యం కాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది.
Read also: Anakapalli: పాఠశాలల్లోకి స్వచ్ఛ రథాలు..పిల్లల చేతికి పుస్తకాలు,పెన్నులు..

Supreme Court verdict on job exams
Govt Jobs Discipline: నిబంధనలు అందరికీ సమానమే
ఒక అభ్యర్థి వెనుకబడిన వర్గానికి చెందిన వారైనంత మాత్రాన నిబంధనల్లో ప్రత్యేక మినహాయింపులు ఆశించడం సరికాదని కోర్టు పేర్కొంది. లక్షలాది మంది అభ్యర్థులు పోటీ పడుతున్నప్పుడు ప్రతి ఒక్కరికీ సమానమైన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. ఎవరికో ఒకరి కోసం షెడ్యూల్ మార్చడం వల్ల మొత్తం నియామక ప్రక్రియపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడింది.
సమయపాలన అత్యంత అవసరమని
ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించిన కేసులో ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. నియామకాల్లో పారదర్శకత ఉండాలంటే నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేసింది. నిబంధనలను అతిక్రమించి ప్రత్యేక సానుభూతిని ఆశించడం పోటీ పరీక్షల స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, అందుకే సమయపాలన అత్యంత అవసరమని వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

