ఇరాన్ అమెరికాల మధ్య కుదరని ఒప్పందంతో చమురు సంక్షోభం పెరిగిపోతోన్నది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న చమురు సంక్షోభం ప్రభావం భారత్‌పై పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ రవాణా వ్యవస్థను ప్రోత్సహించడం ద్వారా పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ క్వార్టర్లలో నివసించే ఉద్యోగులు తమ సొంత వాహనాలకు బదులుగా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించేలా కేంద్రం ప్రోత్సహిస్తోంది.క్వార్టర్ల నుండి ఆఫీసులకు నేరుగా వెళ్లేందుకు, అలాగే మెట్రో స్టేషన్లను అనుసంధానిస్తూ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.మెట్రో లేదా బస్సుల్లో ప్రయాణించే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రోత్సాహకంగా వారి రవాణా భత్యంలో 10% అదనపు పెంపును ప్రకటించింది.
Read Also: Vande Mataram: పాఠశాలల్లో ఉదయం పూట వందేమాతరం ఆలపించడం తప్పనిసరి: బెంగాల్ ప్రభుత్వం
Oil Crisis
Oil Crisis: పనివేళల్లో మార్పులు (Staggered Timings)
ఢిల్లీలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వివిధ ప్రభుత్వ శాఖల పనివేళల్లో మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. అన్ని ఆఫీసులు ఒకే సమయంలో ప్రారంభం కాకుండా, వేర్వేరు సమయాల్లో (Shift basis) పనిచేయడం వల్ల రహదారులపై వాహనాల రద్దీ తగ్గి, తద్వారా ఇంధన వృధా అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు ప్రతి పౌరుడు ఇంధన పొదుపును ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అనవసరపు వాహన వినియోగాన్ని తగ్గించి, ప్రజా రవాణా వ్యవస్థను ఆశ్రయించడం ద్వారా ‘ఆర్థిక ఆత్మరక్షణ’ పాటించాలని ఆయన కోరారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

