Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రదీప్ రావత్ అంత్యక్రియలు పూర్తి

ప్రదీప్ రావత్ అంత్యక్రియలు పూర్తి

వార్త 1 day ago

Pradeep Rawat : భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలనిజంతో మిలియన్ల మంది అభిమానులను సంపాదించుకున్న ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ అంత్యక్రియలు ముంబైలో అత్యశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి.

‘సై’ చిత్రంలో భిక్షూ యాదవ్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు విలనిజం నిర్వచనాన్ని సరికొత్తగా పరిచయం చేసిన ఆయన, తన నటనా ప్రతిభతో చెరగని ముద్ర వేశారు. ‘ఛత్రపతి’, ‘గజిని’, ‘భద్ర’, ‘యోగి’, ‘లక్ష్మి’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో ప్రతికూల పాత్రలు పోషించి, కథానాయకుడికి సరిసమానమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. విలన్‌గా తెరపై ఆయన చూపించిన తీవ్రత, డైలాగ్ డెలివరీ ఆయనను సగటు విలన్ల కంటే భిన్నమైన ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.

బాలీవుడ్, టాలీవుడ్ కన్నీటి నివాళి: తుది వీడ్కోలు పలికిన ప్రముఖులు

ఈ అరుదైన నటుడి ఆకస్మిక నిర్యాణంతో చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప ప్రతిభావంతుడిని కోల్పోయి తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ముంబైలో జరిగిన ఆయన అంతిమయాత్రలో బాలీవుడ్ మిస్టర్ పెర్‌ఫెక్ట్ ఆమిర్ ఖాన్‌తో పాటు పలువురు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని అశ్రునయనాలతో నివాళులర్పించారు. విలనిజంతో కూడా ప్రేక్షకుల మనసులను గెలుచుకోవచ్చని నిరూపించిన ఈ దిగ్గజ నటుడికి సినీ లోకం “ఇక సెలవంటూ” తుది వీడ్కోలు పలికింది. ఆయన పోషించిన భిక్షూ యాదవ్ వంటి పాత్రలు సినీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి.

రేపే వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్లు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha