Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రదీప్ రంగనాథన్ 'LIK' ఓటీటీ ఎంట్రీ.. మే 6 నుంచి స్ట్రీమింగ్!

ప్రదీప్ రంగనాథన్ 'LIK' ఓటీటీ ఎంట్రీ.. మే 6 నుంచి స్ట్రీమింగ్!

వార్త 1 month ago

LIK OTT Release: యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ నుంచి సినిమా వస్తుందంటే చాలు.. అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. తాజాగా ఆయన నటించిన సైంటిఫిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ LIK ఇప్పుడు డిజిటల్ సందడికి సిద్ధమైంది.

ఏప్రిల్ 10న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకున్నప్పటికీ, ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేస్తోంది.

Read Also: Sathi Leelavathi Trailer Release: 'సతీ లీలావతి'గా లావణ్య సందడి.. నవ్వులు పూయిస్తున్న ట్రైలర్

అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్

ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్’, స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 6వ తేదీ నుండి ఈ సినిమా ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. థియేటర్లలో 100 కోట్ల మార్క్ అందుకోలేకపోయిన ఈ చిత్రం, ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

2040 నాటి ప్రేమకథ

విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంటుంది. ఇది సాధారణ ప్రేమకథ కాదు.. 2040వ సంవత్సరంలో ప్రేమలు ఎలా ఉండబోతున్నాయి? అప్పటి యూత్ ఆలోచనా ధోరణి ఎలా ఉంటుంది? అనే అంశాలను సైంటిఫిక్ అండ్ ఫన్నీ వేలో చూపించారు. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 60 కోట్ల దగ్గరే ఆగిపోయినప్పటికీ, కృతి శెట్టి గ్లామర్, ప్రదీప్ కామెడీ టైమింగ్ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఓటీటీలోకి వచ్చేస్తున్న మలయాళ బ్లాక్ బస్టర్ 'వాలా 2'!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha