Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి

ప్రహరీ గోడ కూలి విద్యార్థి మృతి

వార్త 1 month ago

Salur School Accident: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల ప్రహరీ గోడ ఒక్కసారిగా కుప్పకూలడంతో పదో తరగతి విద్యార్థి తుపాకుల అరుణ్ తేజ (15) అక్కడికక్కడే దుర్మరణం చెందగా, మరొక విద్యార్థి యాకూబ్‌ తీవ్రంగా గాయపడ్డాడు.

మధ్యాహ్న భోజనం ముగిసిన అనంతరం విద్యార్థిలిద్దరూ ప్రహరీ గోడపై కూర్చొని మాట్లాడుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం ఇవ్వడంలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ, మృతుడి బంధువులు, స్థానికులు మృతదేహంతో పాఠశాల వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు.

Read Also : Army Recruitment Rally: వైజాగ్‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. సెప్టెంబర్ 3 నుంచి ప్రారంభం

 Compound wall collapses… 10th-grade student dies, another critically injured!

Salur School Accident: ప్రభుత్వం దిగ్భ్రాంతి: తక్షణ సహాయంగా 5 లక్షల ఆర్థిక సాయం

ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి సంధ్యారాణితో మాట్లాడి ప్రమాద వివరాలను సేకరించిన ఆయన, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ. 5 లక్షల తక్షణ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన విద్యార్థి యాకూబ్‌కు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఉన్నతాధికారులను ఆదేశించడమే కాకుండా, మృతుడి కుటుంబానికి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని భరోసానిచ్చారు.

రైఫిల్ షూటింగ్ కోచ్ వేధింపులు భరించలేక ఏఈ నూకరాజు ఫ్యామిలీ ఆత్మహత్య

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha