AP Govt Committee : ప్రభుత్వం ప్రైవేట్ అన్-ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద మరియు బడుగు, బలహీన వర్గాల పిల్లలకు 25 శాతం ఉచిత ప్రవేశాలు కల్పించేందుకు కీలక అడుగు వేసింది.
విద్యాహక్కు చట్టం (RTE) – 2009 సెక్షన్ 12(1)(సీ) అమలుకు సంబంధించి ప్రస్తుత మార్గదర్శకాలను సవరించేందుకు 16 మంది సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు.
AP Govt Committee
AP Govt Committee : కమిటీకి కేటాయించిన బాధ్యతలు
పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమీమ్ అన్సారియా. సమగ్ర శిక్షా స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్. విద్యాశాఖ విభాగాల డైరెక్టర్లు, ఎన్టీఆర్ జిల్లా డీఈవో, బాపట్ల ఎంఈవో, న్యాయ సలహాదారులు, ఎన్జీఓ ప్రతినిధి, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రతినిధి మరియు లబ్ధి పొందిన ఇద్దరు విద్యార్థుల తల్లిదండ్రులు.ఆర్టీఈ చట్టం, సుప్రీంకోర్టు ఉత్తర్వులు (జనవరి 13), మరియు ఎన్‌సీపీసీఆర్ (NCPCR) నిబంధనలను సమగ్రంగా పరిశీలించడం. ఆన్‌లైన్ ద్వారా అడ్మిషన్ల ప్రక్రియ, సీట్ల వివరాల వెల్లడి, మరియు ఫీజుల రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి కొత్త విధానాలను సిఫార్సు చేయడం. ఆర్టీఈ అమలులో ఎదురవుతున్న ఆచరణాత్మక, చట్టపరమైన చిక్కులను గుర్తించి పరిష్కారాలు చూపడం. ఉచిత ప్రవేశాలు పొందిన పేద విద్యార్థుల పట్ల పాఠశాలల్లో ఎలాంటి వివక్ష లేకుండా పటిష్ట చర్యలు చేపట్టడం.
Epaper: epaper.vaartha.com

