Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చే 'ఓటు' వేయాలి

ప్రజాస్వామ్యానికి వన్నె తెచ్చే 'ఓటు' వేయాలి

వార్త 1 month ago

Voters : ఎనభైవ సంవత్సర స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా దేశమంతటా జరుపుకున్ననేపథ్యంలో కొన్ని నిజాలు, పరిణామాలు విశ్లేషిం చుకోవాల్సిన అవసరం ఏర్పడింది!

80వ సంవత్సరం నిండిన ఈ స్వతంత్ర భారత దేశం సాంకేతికం గా, ఆర్ధికంగా, రాజకీయంగా, ప్రజా స్వామ్య దేశంగా ఈ గ్లోబల్ వ్యవస్థ లో నిలదొక్కుకున్న మాట నిజం! అయితే కొన్ని లోటుపాట్లు, ఒడిదు దుకులూ, చిన్నపాటి యుద్ధాలు పాకిస్థాన్తో ముగియని వైరం చైనాతో చిటపటలు ఇంకా సాగుతునే వున్నాయి! ఇతర దేశాలతో ముఖ్యంగా మన ఇరుగు పొరుగు దేశాలతో పోల్చుకుంటే మన దేశం ఎంతో మెరుగైన స్థాయిలో వున్న నిజాన్ని ఎవరూ కాదనలేరు! యూరప్ దేశాలతో, దక్షిణ పశ్చిమ ఆసియా దేశాలతో పెద్దగా విభేదాలను ఎదుర్కొన్న పరిస్థితులు లేవు! అక్కడో ఇక్కడో పొరపొచ్చాలు కొన్ని తొంగి చూసినా, పాలకుల సర్దుబాటు చర్యలతో సమసి పోయాయి! బంగ్లాదేశ్ ఒకప్పటి అధినేత షేక్ హసీనా, అల జడులతో తన దేశం వదిలి మన దేశంలో వుండటం, అల నాటి దలైలామా పరిస్థితిని జ్ఞప్తికి తెస్తున్నది! భారత్ కున్న విశాలత్వం ఆశ్రయం కోరిన వారిని అక్కున చేర్చుకొనేతత్వం చాలా తక్కువస్థాయిలో ఇతర దేశాలలో వున్నమాట నిజం!

 Voters

Voters : జనాభా పెరుగుదల

ఆర్ధికంగా భారత్ కొత్త పుంతలలో వయనించేందుకు సిద్ధం గా వుంది! అయితే ఈమధ్య జరిగిన ఇరాన్ ఇజ్రాయిల్, అమెరికా, రష్యా, ఉక్రెయిన్, సంఘర్షణల వల్ల చమురును నిల్వలుగా వుంచుకోవటం భారమైంది. దిగుమతి చేసుకోటానికి ధరలు కొండెక్కాయి. జలసంధి వివాదంతో ఆయిల్ రవాణా చేసే పిప్పుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది! ఆర్ధికంగా క్రమేపీ గడ్డు పరిస్థితి అంచనాలకు అందకుండా వుంది! జనాభా పెరుగుదల వల్ల మన దేశం చైనానుసంఖ్య లో అధిగమించింది. కానీ జనాభా పెరుగుదల కూడా ఆర్థి కంగా ఉన్నత దశలో దేశం లేనప్పుడు అదీ సమస్యగానే మారుతుంది! నిరుద్యోగ సమస్య నిన్నా, మొన్నా జరిగిన జెన్నీ ఉద్యమంతో ప్రాథమిక సమస్యగా మారి విద్యా విధానంలో కూడా మార్పు తేవాలనే ఆలోచనను ముందుకు తెచ్చింది! తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య ఉద్యోగాలకు సంబం ధించిన అంశం ప్రాముఖ్యతను సంతరించుకున్న నేపథ్యం లో మంచీ చెడుల ప్రసక్తి తేక తప్పదు! రాజకీయానికే ప్రాముఖ్యతను ఇచ్చే పార్టీల హడావిడి, కొన్ని వేలమంది ఉద్యోగస్థులుగా మారిన తరుణంలో ప్రజలు ఏవిధంగా అర్థం చేసుకుంటారో చూడాలి! ఇలాంటి వాటివల్ల అన్ని రాష్ట్రాల లోకి నిరుద్యోగ సమస్యను ప్రభుత్వాలు చొరవచూపి పరి ష్కరించటంలో వెనుకంజ వేసే ప్రమాదం గూడా వుంది! రాజకీయం కాదు ముఖ్యం అనుకొని ప్రజలు, మేధావులు గూడా చొరవచూపి తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చూపించకపోతే నిరుద్యోగ సమస్య మరింత జటిలమవు తుంది! ఇవన్నీ ఒక ఎత్తు. ప్రజాస్వామ్య పరిధులలో పాల కులు వ్యవహరించాలన్నది మరొక ఎత్తు!

ప్రతిపక్షం సహేతుకంగా వ్యవహరిస్తున్నా ..

పాలక వర్గం లోనివారు ప్రతిపక్ష వర్గంలోని వారు శత్రువులేం కారు! ఎన్నికలలో పోటీ చేసేంతవరకే ప్రత్యర్థులు! ఎన్నికల తర్వాత సమస్యల్లో న్యాయం జరగకపోతే పోరాడాల్సింది ప్రతిపక్ష నాయకులు! పరిష్కరించాల్సింది పాలకులు! అంత వరకే! అంతేగాని, ఫ్యాక్షనిస్టుల మాదిరి మాటల తూటాలు పేల్చుకుంటూ, ఆగర్భ శత్రువుల్లా వ్యవహరించటం ప్రజా స్వామ్యం ఒప్పుకోదు! ఎవరికి ఎక్కువ సంఖ్యలో ఓట్లుపడితే న్యాయబద్ధంగా వారు పాలన సాగించాలి! అంతేగాని అర్ధం పర్ధం లేకుండా ఓడిన వారు గెలిచిన వారిని ‘దిగిపో’ అంటే చట్టం ఒప్పుకోదు! ఆ మాత్రం ఇంగిత జ్ఞానంతో అన్ని పక్షా లూ ప్రజాస్వామ్య పాలనలో వ్యవహరించాలి! ఆ నిజాన్ని అందరూ ఒప్పుకోక తప్పదు! అధికారం ఉంది కదా అని ప్రతిపక్షం సహేతుకంగా వ్యవహరిస్తున్నా వారి గొంతు బయట వినపడనీయకుండా చేసినా, చట్టం చూసీచూడనట్లు ఉండొచ్చు కానీ చట్ట సభలల్లో ఆ ప్రవర్తనను ప్రదర్శిస్తే అది ఎవరు చేసినా తీవ్రంగా పరిగణించక తప్పదు! పోతే చట్ట సభలలో శాంతిగా వ్యవహరించటం భద్రతా పరంగా ప్రవర్తన అదుపులో ఉంచుకోక వారు చట్ట సభలల్లో పాల్గొ నటానికి అనర్హులు! ఆ నిజం ఒప్పుకోక తప్పదు! సరియైన చర్యలు అవశ్యం తప్పదు! కేవలం చట్ట సభల ప్రతినిధులే కాదు ఈ నిజాన్ని జ్యుడిషియరీ పాలనా యంత్రాంగంకూడా కాదనలేదు! ఈమధ్య కాలంలో న్యాయ వ్యవస్థలు విమర్శలకు తావిస్తున్నాయని విజ్ఞులు భావిస్తున్నారు. న్యాయం చెప్పాల్సిన వారే న్యాయ పరిధులలో ఉండకపోతే కంచే చేను మేసినట్లు భావించక తప్పదు! ఆ నిజాన్ని సంబంధిం చిన వారు ఒప్పుకోవాల్సిందే! న్యాయ సమ్మతంగా వుండాలి! న్యాయ పరిధిలో వ్యవహరించాల్సిన బాధ్యత వారిమీదే ఉందని గుర్తించాలి.

 Voters

ఓట్లర్లకూ బాధ్యత వుంది

కేవలం ప్రభుత్వ అంగాలనే ప్రతి విష యంలోనూ తప్పు పట్టటం కూడా సరికాదు! ప్రజలు గూడా ఈ ప్రజాస్వామ్య పాలనలో బాధ్యులే! రాజకీయ నైతికత ఈమధ్య కాలంలో ప్రజలు క్రమ క్రమంగా కోల్పోతున్నారు. చదువులేనివారు గ్రామాల్లో వుండే ప్రజలు ఓట్ల విషయంలో ఎన్నికల విషయంలో ఇంతకు మునుపు ఎంతో నీతిమంతు లుగా వుండే వారు! ప్రలోభాలకు లొంగి పోకుండా ఓటును పవిత్రంగా చూడటమే కాదు దానిని సక్రమంగా నచ్చిన రీతిలో వాడుకొని ప్రజాస్వామ్యానికి వన్నె తేవటమే కాదు మెరుగులు దిద్దేవారు! ఇప్పుడు ఆ విజ్ఞత ఎందుకు కోల్పో తున్నారు!? చదువులు పెరిగాయి సాంకేతికత పెరిగింది! అన్ని రకాల అభివృద్ధి పొందుతున్నాం! న్యాయంగా, నీతిగా ఉండాలనే జ్ఞానాన్ని చదువుల ద్వారా పొందిన, పొందుతున్న పౌరులు ప్రజాస్వామ్య పరిధిలో వ్యవహరించాల్సిన వారు, ఎందుకు నైతికతను కోల్పోతున్నారు? వారి ప్రతినిధులను ఎన్నుకోవటంలో ఎందుకు ప్రలోభాలకు లొంగి స్వలాభం చూసుకుంటున్నారు? ఓట్లర్లకూ బాధ్యత వుంది! ఆ బాధ్యత సక్రమంగా నిర్వహించాల్సిందే! ఆ నిజాన్ని కప్పిపెట్టలేరు! ప్రతి యుగంలోనూ ప్రజలు తమ లక్ష్యం గుర్తించినప్పుడే బాధ్యతతో వ్యవహరిస్తారు! లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేస్తే తమను తామే మోసగించుకొని కష్టాల పాలవుతారు!దారి కోల్పోయి నియంతలకు దారి చూపించిన వారవుతారు! మన దేశానికి చివరి నిముషంలో నైనా సరియైన దారిలో పంపిన చరిత్ర ఉంది! ఆ నిజాన్ని ఈనాటి వారు నిజం చేయాలి!.

-రావులపాటి సీతారాంరావు

Read hindi news : hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

గ్రామాల్లో తగ్గిన నిరుద్యోగ రేటు..కీలక సర్వే వెల్లడి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha